ఈ నెల 27 లేదా 30వ తేదీలలో పులిచింతల ప్రాజెక్టు ప్రారంభానికి జిల్లాకు సీఎం వస్తున్నారన్న సమాచారం తనకు పూర్తిస్థాయిలో తెలియదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
హుజూర్‌నగర్ : ఈ నెల 27 లేదా 30వ తేదీలలో పులిచింతల ప్రాజెక్టు ప్రారంభానికి జిల్లాకు సీఎం వస్తున్నారన్న సమాచారం తనకు పూర్తిస్థాయిలో తెలియదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. బహుశా ప్రాజెక్టును గుంటూరు జిల్లానుంచే ప్రారంభించవచ్చని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన హుజూర్‌నగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటనను అడ్డుకుంటారా అని విలేకరులు ప్రశ్నించగా తెలంగాణ ప్రాంతంలోఆయన పర్యటనే లేదని, అలాంటప్పుడు అడ్డుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రచ్చబండ-3లో గృహనిర్మాణశాఖ ద్వారా 13 లక్షల 65వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధికి అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు.