టీఆర్‌ఎస్‌కు కౌంట్‌డౌన్‌ షురూ | t-pcc fire on telangana govt | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు కౌంట్‌డౌన్‌ షురూ

Published Sat, Jan 28 2017 1:32 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

టీఆర్‌ఎస్‌కు కౌంట్‌డౌన్‌ షురూ - Sakshi

టీఆర్‌ఎస్‌కు కౌంట్‌డౌన్‌ షురూ

2019లో కాంగ్రెస్‌దే అధికారం: ఉత్తమ్‌
సీఎం కేసీఆర్‌ ప్రజలను మభ్యపెడుతున్నారు
స్థాయి మరిచి మరీ ఎంపీ కవిత విమర్శలు
నోట్ల రద్దుపై ప్రధాని మోదీతో కేసీఆర్‌ కుమ్మక్కు
తాము అధికారంలోకి రాగానే ఇందిరమ్మ బిల్లులు చెల్లిస్తామని వ్యాఖ్య
టీపీసీసీ ఆధ్వర్యంలో జన ఆవేదన సమ్మేళనం


హైదరాబాద్‌: ప్రజలను మాయమాటల తో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ ఎస్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యా నించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారం లోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. నోట్ల రద్దుకు నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో శుక్రవారం సికింద్రాబాద్‌లో జన ఆవేదన సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ఏఐసీసీ తరఫున కొప్పుల రాజు, ఆర్‌.సి.కుంతియా, కె.బి.కృష్ణమూర్తి, కర్ణాటక మంత్రి శివకుమార్‌ ప్రతినిధులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడు తూ.. రెండు పడక గదుల ఇళ్లు, దళితులకు భూమి, యువతకు ఉద్యోగాలు వంటి హామీ లతో సీఎం కేసీఆర్‌ ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండున్న రేళ్లు దాటినా 300 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కూడా పూర్తి చేయలేదన్నారు. టీఆర్‌ఎస్‌కు పతనం ప్రారంభమైందని.. 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇళ్ల బిల్లు బకాయిలు చెల్లిస్తామని.. అదనంగా మరో గది కూడా మంజూరు ఇస్తామని హామీ ఇచ్చారు.

స్థాయి మరిచి ఎంపీ కవిత విమర్శలు
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి సోనియాగాంధీ రాష్ట్రం ఇచ్చారని.. కానీ అధికారంలోకి వచ్చామనే అహంకారంతో కళ్లు నెత్తికెక్కిన టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత ఏకంగా రాహుల్‌గాంధీపై నోరు పారేసుకున్నారని ఉత్తమ్‌ మండిపడ్డారు. ‘‘రాహుల్‌ గాంధీని విమర్శించే స్థాయి కవితదా? సోనియాగాంధీ దయతో మీ అయ్య కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. కావాలంటే మీ అయ్యను అడిగి తెలుసుకో..’’అని వ్యాఖ్యానించారు.
పేదలపై సర్జికల్‌ స్ట్రైక్‌
నోట్ల రద్దు ద్వారా ప్రధాని మోదీ సామాన్యులు, పేదలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌కు పాల్పడ్డారని ఏఐసీసీ ఎస్సీసెల్‌ చైర్మన్‌ కొప్పుల రాజు విమర్శించారు. ఇది వ్యూహాత్మక దోపిడీ అని.. కమలం పార్టీ అంటేనే పేదలను లూటీ చేస్తున్న పార్టీ అని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుపై వచ్చే నెల 6 నుంచి వారం పాటు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో జన ఆవేదన పంచాయతీలను నిర్వహించాలని ఏఐసీసీ పిలుపు ఇచ్చినట్టు కర్నాటక మంత్రి శివకుమార్‌ వెల్లడించారు. నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్నవారి వీడియోలను ఏఐసీసీకి పంపించాలన్నారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులపై అసెంబ్లీలో నిలదీసినందుకే ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ సమావేశం పెట్టారని.. సబ్‌ప్లాన్‌ నిధులపై కేసీఆర్‌ను నిలదీస్తామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. భూసేకరణ చట్టానికి ప్రభుత్వమే తూట్లు పొడుస్తుంటే ఆపకుండా.. గవర్నర్‌ కూడా సీఎం కేసీఆర్‌కు భజనమండలిగా మారారని షబ్బీర్‌ అలీ విమర్శించారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారో గవర్నర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నోట్ల రద్దు ప్రజావ్యతిరేక నిర్ణయమని పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. బంగారు వడ్డాణాలు ఇస్తామంటేనే కార్యక్రమాలకు వెళ్తున్న కవితకు కాంగ్రెస్‌ పార్టీ గురించి మాట్లాడే స్థాయిలేదని మాజీ ఎంపీ మధుయాష్కీ విమర్శించారు. ముఖ్యమంత్రులు అవుతామనే కలలు కనడమే కాకుండా పార్టీ కేడర్‌ను కాపాడుకోవాలని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి నేతలకు సూచించారు. విభేదాలను విడనాడి పార్టీకోసం పనిచేయాలన్నారు. సమావేశంలో సీనియర్‌ నేతలు కె.జానారెడ్డి, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, మల్లు రవి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, ఉద్దెమర్రి నర్సింహారెడ్డి, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ది దిక్కుమాలిన పని
ప్రధాని మోదీ అహంకారంతో, అనాలోచితంగా నోట్లు రద్దు చేశారని... దానికి సీఎం కేసీఆర్‌ మద్దతిచ్చి దిక్కుమాలిన పనిచేశారని ఉత్తమ్‌ మండిపడ్డారు. మోదీ, కేసీఆర్‌ల మధ్య రహస్య బంధమే దీనికి కారణమని ఆరోపించారు. కేసీఆర్‌ నిస్సిగ్గుగా నోట్ల రద్దుకు అనుకూలంగా అసెంబ్లీలో మాట్లాడారని విమర్శించారు. నోట్ల రద్దుతో ఆదాయం తగ్గిందని, రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయలేమన్న కేసీఆర్‌... దానికి ఎందుకు మద్దతు ఇచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. నగదు ఉపసంహరణపై ఆంక్షలు ఎత్తివేయాలని, పేద మహిళల ఖాతాల్లో 25 వేలు డిపాజిట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement