
భూములు ఇచ్చారనడం అవాస్తవం
కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లినందుకే తనకు హఫీజ్‌పూర్‌లో భూమిని నజరానాగా ఇచ్చారన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆరోపణలు అవాస్తవమని
పీసీసీ అధ్యక్షుడి విమర్శలను తిప్పికొట్టిన ఎమ్మెల్యే రెడ్యానాయక్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లినందుకే తనకు హఫీజ్‌పూర్‌లో భూమిని నజరానాగా ఇచ్చారన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆరోపణలు అవాస్తవమని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. హఫీజ్‌పూర్ సర్వే నంబర్ 80లో 2006 జనవ రిలో భూమి కొన్నామని, 2008లోనే తిరిగి అమ్మేశానని, అవి పూర్తిగా ప్రైవేట్ భూములని వివరించారు. టీఆర్‌ఎస్‌లో చేరాక, సెంట్ భూమి కొన్నానని ఆధారాలు చూపిస్తే, ఆ భూమి ఉత్తమ్‌కే రాసిస్తానన్నారు.