
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు సంబంధించి టీఆర్‌ఎస్, టీడీపీలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం సాయంత్రం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తదితరుల సమక్షంలో గాంధీ భవనలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.
వీరిలో ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్, టీడీపీ కార్యకర్తలతోపాటు సీపీఐ (ఎంఎల్)కు చెందిన నాయకులు కూడా ఉన్నారు. వీరందరికీ ఉత్తమ్, భట్టిలు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఖమ్మం డీసీసీ నేత పూవ్వాళ్ల దుర్గాప్రసాద్, ఇల్లందు మున్సిపాలిటీ కాంగ్రెస్ పక్ష ఫ్లోర్ లీడర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment