టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా జానా..!
హైదరాబాద్: పార్టీ శాసనసభ ప్రతిపక్ష నేత జానారెడ్డి తీరుపై టీ కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీరుపై ఏకంగా పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేసే యోచనలో వారు ఉన్నారు. గోదావరి నదిపై ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో గతంలో ఎలాంటి ఒప్పందం జరగలేదంటూ జానారెడ్డి టీఆర్ఎస్కు అనుకూలంగా మాట్లాడటమే ఇందుకు కారణం. జానా తీరుతో కాంగ్రెస్ ఇమేజ్ దెబ్బతింటుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు మాట్లాడారంటూ జానాకు పలువురు టీ కాంగ్రెస్ నేతలు ఫోన్ చేసి అడిగినట్లు సమాచారం.
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రూ.5 భోజనాన్ని గతంలో జానారెడ్డి మెచ్చుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన పలుసార్లు కేసీఆర్ సర్కార్ కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో సొంతపార్టీలోనే జానా వైఖరి ఏమిటో తెలియక అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో జానారెడ్డి తీరుతో పార్టీకి నష్టం జరుగుతున్నదంటూ.. ఇక ఆయన ధోరణిని సహించేది లేదని, ఆయనపై హైకమాండ్కు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ ముఖ్యలు కాంగ్రెస్ ముఖ్యలు భావిస్తున్నట్టు సమాచారం.