మెత్తగా మాట్లాడితే ఎలా?.. జానాకు జైపాల్‌రెడ్డి సలహా! | Jaipal Reddy Gives advise to Janareddy | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 3 2018 5:04 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Jaipal Reddy Gives advise to Janareddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ సీఎల్పీ నేత, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జానారెడ్డి గురించి ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జానారెడ్డి ఎప్పుడూ వెనుకంజ వేసే వ్యక్తి కాదని, అలాగని దూకుడుగా కూడా ఉండరని ఆయన చెప్పుకొచ్చారు. జానారెడ్డి ప్రత్యేక వక్తిత్వం కలిగిన వ్యక్తి అని, పుస్తకాల్లో ఉన్నవి తెలుసుకోవడమే కాకుండా నిపుణులతో చర్చించి పలు విషయాల మీద మాట్లాడుతారని జైపాల్‌రెడ్డి అన్నారు. జానారెడ్డి నిజం చెప్పేందుకు వెనకంజ వేయబోరని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లో జానారెడ్డి అంతా సుదీర్ఘ అనుభవం  ఉన్న వ్యక్తి మరొకరు లేరని పేర్కొన్నారు. రాజకీయంలో అజాత శత్రువుగా ఉండడం ఎంత ముఖ్యమో.. అవసరమైనప్పుడు ధర్మాగ్రహం ప్రదర్శించాలని, మెత్తగా మెల్లగా మాట్లాడితే బలహీనతగా చూస్తారని, అందుకే అప్పుడప్పుడు దూకుడుగా ఉండాలని జానారెడ్డికి జైపాల్‌రెడ్డి హితవు పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement