సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో కొంత మంది పార్టీ నాయకులపైనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు. ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇతరులను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి అధికమవుతున్నాయని, కొంత మంది నాయకుల అభిమానులు ఇలాంటివి చేస్తున్నారని మండిపడ్డారు. దీని ద్వారా ఆ నాయకుడికే నష్టం జరుగుతుందని హితవు పలికారు.
ఇలాంటివి జరిగితే పార్టీ కూడా చాలా సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఇటువంటి వాటిని పీసీపీ కూడా పట్టించుకోకపోతే హైకమాండ్ దృష్టికి తీసుకెళతానని అన్నారు. నాయకులు కూడా క్రమశిక్షణతో మెలాగాల్సిన అవసరం ఉందన్నారు. అందరం సమావేశమై అందరి నాయకుల అభిమానులను హెచ్చరించాల్సిన అవసరం ఉందని జానారెడ్డి తెలిపారు.
చదవండి: త్వరగా సీరం సర్వే చేయాలి..
Comments
Please login to add a commentAdd a comment