
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్ని కల్లో మద్దతివ్వాలని కాంగ్రెస్ పార్టీ టీడీపీని కోరింది. మంగళవారం సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ అభ్యర్థి బలరాంనాయక్‌కు మద్దతివ్వాలని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను కోరినట్లు తెలిపారు. కాగా, రాజ్యసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఎమ్మెల్యేలు వెంకటవీరయ్య, ఆర్.కృష్ణయ్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ టీడీఎల్పీలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసినా గెలిచే పరిస్థితి లేనందున తటస్థంగా ఉండటమే మేలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అధికారిక నిర్ణయాన్ని బుధవారానికి వాయిదా వేశారు.
విప్‌గా రామ్మోహన్‌రెడ్డి
కాంగ్రెస్ శాసనసభా పక్షం విప్‌గా ఎస్.ఎ.సంపత్‌కుమార్ స్థానంలో పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి నియమితులయ్యారు. సంపత్‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరించడం తో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, కార్యదర్శి నర్సింహాచార్యులకు సీఎల్పీ నేత కె.జానారెడ్డి మంగళవారం లేఖలు రాశారు.
Comments
Please login to add a commentAdd a comment