'రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు'
Published Sat, Aug 8 2015 2:15 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయని మాజీ మంత్రి, సీఎల్పీ నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. రైతులు ఇబ్బందులు పడుతూ తీవ్ర ఆందోళనలో ఉన్నారని జానా ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతుల సమస్యలు చర్చించేందుకు అసెంబ్లీని వెంటనే సమావేశపర్చాలని ప్రభుత్వానికి సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అవతకలపై సీఐడీ విచారణను ప్రభుత్వం బయటపెట్టాలన్నారు. అవతవకలకు ఎవరు పాల్పడినా బయటపెట్టాలన్నారు.
పారిశుద్ధ్య కార్మికుల సమస్యపై సీఎంతో చర్చించేందుకు సచివాలయానికి వచ్చిన వివిధ పార్టీల నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల నుంచి వినతులు తీసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో చర్చించి సమ్మెను విరమింపచేయాలని జానారెడ్డి సూచించారు.
Advertisement
Advertisement