
వినాశకాలే.. విపరీతబుద్ధి అన్నట్లు కేసీఆర్ తీరు: జానారెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు వ్యవహరిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి విమర్శించారు. పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే కనకయ్యపై అనర్హత వేటు వేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి పిటిషన్ ఇచ్చినట్లు తెలిపారు.
గెలిచిన పార్టీ, పదవికి రాజీనామా చేయకుండా వేరే పార్టీలో చేరడం అనైతికం, చట్టవిరుద్ధమని ఆయన అన్నారు. స్పీకర్ రాజ్యాంగపరంగా వ్యవహరించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారని ఆశిస్తున్నట్లు జానారెడ్డి చెప్పారు.