'తెలంగాణ సత్తా ఏంటో పార్లమెంట్లో చూపిస్తాం' | Will be shown in telangana power in parliament, says ktr | Sakshi
Sakshi News home page

'తెలంగాణ సత్తా ఏంటో పార్లమెంట్లో చూపిస్తాం'

Jul 6 2016 7:14 PM | Updated on Aug 31 2018 8:26 PM

'తెలంగాణ సత్తా ఏంటో పార్లమెంట్లో చూపిస్తాం' - Sakshi

'తెలంగాణ సత్తా ఏంటో పార్లమెంట్లో చూపిస్తాం'

హైకోర్టు విభజన జరిగేవరకూ పార్లమెంట్ సమావేశాలను స్తంభింపచేస్తామని ఐటీ శాఖమంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కరీంనగర్ : హైకోర్టు విభజన జరిగేవరకూ పార్లమెంట్ సమావేశాలను స్తంభింపచేస్తామని ఐటీ శాఖమంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ తెలంగాణ సత్తా ఏంటో పార్లమెంట్లో చూపిస్తామన్నారు. ప్రాజెక్టులు నిర్మిస్తే రాజకీయ పునాదులు కదులుతాయని కాంగ్రెస్, టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు.

తమది కూడా భూ నిర్వాసితుల కుటుంబమే అని ఆయన అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి జానెడు జాగా కూడా ఏ ప్రాజెక్ట్లో పోలేదని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. నిర్వాసితులకు ఉండే బాధ జానారెడ్డికి తెలియకనే 123 జీవో ప్రకారం పరిహారాన్ని అడ్డుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement