'భోజనం చేశాక బాగా మాట్లాడుకోవచ్చు' | we can talk well after eating food: cm kcr | Sakshi
Sakshi News home page

'భోజనం చేశాక బాగా మాట్లాడుకోవచ్చు'

Published Wed, Sep 30 2015 2:12 PM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM

'భోజనం చేశాక బాగా మాట్లాడుకోవచ్చు' - Sakshi

'భోజనం చేశాక బాగా మాట్లాడుకోవచ్చు'

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ముగిశాక తెలంగాణ అసెంబ్లీలో కొన్ని అప్యాయతతో నిండిన మాటలు వినిపించాయి. రైతుల ఆత్మహత్యల విషయంపై తాను సలహాలు ఇవ్వాలనుకుంటున్నకాంగ్రెస్ నేత జానారెడ్డి మాట్లాడుతూ తన సలహా సుదీర్ఘంగా ఉంటుందని, మీకు అభ్యంతరం లేకుంటే సగం ఇప్పుడు.. మరో సగం భోజన కార్యక్రమం ముగించుకొని వచ్చాక చెబుతానని సభకు తెలియజేశారు. లేదంటే సభ్యులు భోజనం పూర్తి చేశాకే మాట్లాడదామని, అంతా మీ ఇష్టం అని అన్నారు.

దీనికి స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. 'భోజనం చేస్తేనే బాగా మాట్లాడుకుంటాం, విస్తృతంగా చర్చించుకుంటాం. అందుకే భోజనం తర్వాత మీ సలహాలు ఇవ్వండి' అని అన్నారు. అందుకు జానారెడ్డి స్పందిస్తూ భోజనం చేశాక మీరూ వస్తారా అని ప్రశ్నించగా తప్పకుండా వస్తాను.. అందరం మంచిగా చర్చించుకుందాం అదేందే అట్లాంటారు. భోజనం చేసి వద్దాం నో ప్రాబ్లమ్' అనగానే సభలో నవ్వులు విరిశాయి. దీంతో స్పీకర్ సభను అరగంట పాటు భోజన కార్యక్రమం కోసం వాయిదా వేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement