'మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయ అన్నారు' | ormers suicide not solved in over night: cm kcr | Sakshi
Sakshi News home page

'మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయ అన్నారు'

Published Wed, Sep 30 2015 12:42 PM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM

'మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయ అన్నారు' - Sakshi

'మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయ అన్నారు'

హైదరాబాద్: రైతుల ఆత్మహత్యల సమస్య రాత్రికి రాత్రే పరిష్కారం అయ్యేది కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దీని నివారణ కోసం స్వల్ప మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం అని చెప్పారు. రెండు రోజులపాటు అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యలపై చాలా చక్కగా సుదీర్ఘ చర్చ జరిగిందని, అయితే, ప్రతిపక్షాల నుంచి మంచి సలహాలు, సూచనలు వస్తాయని అనుకున్నాను కాని నిరాశపరిచారని చెప్పారు.  రైతుల ఆత్మహత్యల నివారణ కోసం సమస్య మూలాల్లోకి వెళ్లి పరిశీలించాలని హైకోర్టు చక్కటి సలహా ఇచ్చిందని, అందుకు ధన్యవాదాలని చెప్పారు.

రైతుల ఆత్మహత్యలకు ప్రధానంగా రెయిన్ షాడో, కరువులు, అడవులు నరికివేత, భూగర్భ జలాలు లేకపోవడం, మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు కరెంటు బిల్లులు, బకాయిలు, వ్యవసాయ శాఖలో పరిశోధనలలేమి కారణం అని చెప్పారు. వర్షాలు లేక పరిస్థితి దారుణంగా తయారైందని తాను కూడా ఓ 50 ఎకరాల్లో అల్లం పెట్టానని అది పండుద్దో ఎండుద్దో అర్థం కావడం లేదని తెలిపారు. ఇంకా ఏం చెప్పారంటే..

  • వ్యవసాయశాఖలో పరిశోధనలు కుప్పకూలాయి.
  • ఉస్మానియాకు అనుభందంగా ఉన్న వ్యవసాయ వర్సిటీని విడదీసి ధ్వంసం చేశారు. నేడు రీసెర్చ్ లేకుండా పోయింది.
  • నేను వ్యక్తులను, పార్టీలను నిందించడం లేదు.
  • కాకతీయ రెడ్డి రాజుల పుణ్యమా అని 75 చెరువులు తవ్వించారు.
  • ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్టు నిజాం సాగర్ ప్రాజెక్టు
  • ఇరిగేషన్పై, రైతుల ఆత్మహత్య నివారణపై ఏ సలహాలు ఇచ్చినా స్వీకరిస్తాం
  • భారత్లో ఎక్కడా లేని విత్తన కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయి
  • ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే దశాబ్దాలుగా నిర్ర నీలుగుతున్నాయి
  • 16 నెలల్లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రాజెక్టులు ఎలా ధ్వంసం చేస్తుంది
  • పద్దులు కట్ చేసి రైతులను ఆదుకోవాలని చెప్పిన సూచన స్వీకరిస్తాం
  • విద్యుత్ సమస్యను అధిగమించాం. అవకాశం ఉన్న ప్రాంతాలకు వెళ్లి విద్యుత్ కొన్నాం
  • ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగదనే మలిదశ ఉద్యమం జరిగింది
  • అద్భుతమైన నేలలు తెలంగాణ సొంతం
  • తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ వరల్డ్ అవుతుందని సైంటిస్టులు చెప్పారు.
  • హైదరాబాద్ చుట్టుపక్కల 300 విత్తన కంపెనీలు ఉన్నాయి.
  • ఐఏఎస్, ఐపీఎస్ నియామకాలే నెలలు పట్టాయి.
  • దేశంలో 2.50లక్షల స్థాపిత విద్యుత్ ఉంది.. కానీ వాడుతుంది సగమే.
  • నీళ్ల దోపిడి విషయంలో అన్ని సభల్లో చెప్పాం. సమైక్య రాష్ట్రంలో పెద్ద దగానే ఈ విషయంలో జరిగింది.
  • అందరం వ్యవసాయ కుటుంబంలోనుంచి వచ్చాం.
  • కరెంటు సమస్య లేకుండా తొలిసారి సభ జరుగుతుంది.
  • రైతులకు ఎన్నిగంటలు చెప్పామో అన్నిగంటలు విద్యుత్ ఇస్తున్నాం
  • 11 నెలలుగా పరిశ్రమలకు 24గంటల విద్యుత్ ఇస్తున్నాం
  • క్వాలిటీ విద్యుత్ ఇస్తున్నాం. ట్రాన్స్ ఫార్మర్లు, మోటర్లు కాలడంలేదు. రిపేరు సంస్థలు మూతపడ్డాయి.
  • కట్టెలు పాతి కరెంట్ తెస్తానని నేను ఎప్పుడూ చెప్పలేదు. తలకాయ ఉన్న ఏ ముఖ్యమంత్రి అలా చెప్పడు
  • వచ్చే ఏడాది మార్చి తర్వాత ఉదయంపూటే రైతులకు ఎనిమిది గంటల విద్యుత్ ఇస్తాం
  • 2018 గంటలు ముగిసే నాటికి రైతులకు 24గంటల త్రీఫేజ్ విద్యుత్ ఇస్తాం
  • రూ.91,000 కోట్లతో విద్యుత్ సమస్యకు చెక్ పెట్టబోతున్నాం.
  • దయచేసి రైతులు ఏ రైతు ఆత్మహత్యకు పాల్పడవద్దు.
  • తెలంగాణ తెచ్చుకుంది రైతుల ఆత్మహత్యలు చూడటానికి కాదు.
  • కాకతీయ రెడ్డి రాజులు ఇచ్చిన మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ దెబ్బతిన్నది.
  • పంజాబ్కు చెందిన రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, నీళ్ల కోసం నిత్యం శ్రమించే వ్యక్తి రాజేందర్ సింగ్ వరంగల్ చెరువుపై పుట్టిన రోజు జరుపుకున్నారు.
  • కాకతీయ మిషన్ ప్రారంభించకముందే కమిషన్ కాకతీయ అన్నారు.
  • రైతులు స్పందించారు. లక్షల ట్రాక్టర్ల పూడిక తీసి పొలాల్లోకి వేసుకున్నారు
  • ఇప్పటి వరకు ఆరు వేల చెరువుల పూడిక తీశాం.
  • గత ప్రభుత్వం చేసిన 480 కోట్ల అగ్రికల్చర్, 60 కోట్ల హార్టికల్చర్ బకాయిలు మా ప్రభుత్వం చెల్లించింది.
  • గతంలో ఆత్మహత్య చేసుకున్నవారిని కూడా నష్టపరిహారం చెల్లించే జాబితాలో చేర్చాం.
  • దాని ప్రకారం 290మందికి ఎక్స్ గ్రేషియా చెల్లించాం.
  • గతంలో విత్తనాల కోసం ఓ లడాయి, ఎరువుల కోసం ఓ లడాయి. క్యూలో చెప్పులు. లాఠీ ఛార్జీలు జరిగాయి, ఫైరింగ్ వరకు వెళ్లాయి.
  • నేనే స్వయంగా విత్తన సమస్యకు గల కారణాలు రాష్ట్ర, కేంద్ర అధికారులను అడిగి తెలుసుకున్నాను.
  • డిమాండ్లేని సమయంలో విత్తనాలు కొని దగ్గరపెట్టుకోవాలని అధికారులకు చెప్పాను. ఆ ప్రకారం సమస్యలు లేకుండా విత్తనాలు ఎరువులు చెల్లించాం.
  • యూరియా ఇప్పటికీ బఫర్ స్టాక్ తీసుకొచ్చి సిద్ధంగా ఉంచాం.
  • 1076 గోదాములు ఉన్నాయి. వాటి కెపాసిటీ 4లక్షల టన్నుల మాత్రమే.
  • 17 లక్షల టన్నుల అదనపు నిల్వల కోసం గోదాములు నిర్వహిస్తున్నాం.
  • డ్రిప్ ఇరిగేషన్ కోసం ఎస్సీ, ఎస్టీలకు 100శాతం, బీసీలకు 90శాతం సబ్సిడీ ఇచ్చాం.
  • 2009-2014 మధ్య సీసీఐ 1,40 కింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తే.. ఒక్క ఏడాది తమ పాలనలో సీసీఐ 1,80 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు చేసింది.
  • మార్చినాటికి తెలంగాణలోని అన్ని మండల కేంద్రాల్లో గోదాములు ఉంటాయి.
  • ఎఫ్ఆర్ బీఎం కింద రూ.3వేల కోట్ల నిధులు రానున్నాయి.
  • ప్రభుత్వం రక్షించలేని భూములు అమ్మకానికి పెడతాం.
  • ప్రభుత్వ భూములు అమ్మితే రూ.2వేల కోట్ల నుంచి 3 వేల కోట్లు రావచ్చు.
  • పన్నులు బకాయిలు రూ.4500 కోట్లు రావాలి.
  • 600 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చాం.
  •  364 సీడ్ కంపెనీలు ఉన్నాయి. వాటిని ఒక్కో మండలాన్ని దత్తత తీసుకొని అగ్రిమెంట్ బ్యాక్ ఇవ్వాలని కోరాం.
  • వచ్చే జనవరిలోగా సగానికి పైగా మండలాల్లో విత్తన ఉత్పత్తి జరిగేలా, సీడ్ కంపెనీలు దత్తత తీసుకునేలా నేను బాధ్యత తీసుకుంటాను.
  • దీర్ఘకాలికంగా ప్రణాళికలే రైతుల ఆత్మహత్యలు ఆపుతాయి.
  • రీసెర్చ్తో ప్రొడక్టివిటీ పెంచాలి.
  • 1280 టీఎంసీ కేటాయింపుల కృష్ణా, గోదావరి నీటిని రైతుల కోసం తెప్పించేందుకు ఇరిగేషన్పై 25 వేల కోట్లు ప్రతి సంవత్సరం కొనుగోలు చేస్తాం
  • ఐదు వేల ఎకరాలకు ఒక అగ్రికల్చర్ అధికారి ఉంటారు.
  • దయచేసి ఏ రైతు ఆత్మహత్య చేసుకోవద్దు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement