formers issue
-
కమతంపై పోలీసు పెత్తనం
అది 20వ శతాబ్దం... 1941 జూన్ 17, సూర్యాపేట – జనగామ రోడ్డు. మాసిన షేర్వానీ, చిరిగిన అడ్డ పంచ నడుముకు చుట్టి ఓ బక్కపలచని ఫకీరు నడుచుకుంటూ వెళ్తున్నాడు. కండలు తిరిగిన గూండా ఒకడు కొడవలితో ఫకీరు మెడ మీద వేటు వేశాడు. ఇంకోడు కత్తితో పొడిచాడు. చనిపోయిన ఆ ఫకీరు షేక్ బందగి అయితే... చంపిన వారు విస్నూర్ దేశముఖ్ గూండాలు. షేక్ బందగికి వారసత్వంగా వచ్చిన పట్టా భూమిని విస్నూరు దేశముఖ్ బంటు దౌర్జన్యంగా మలుపు కున్నాడు. బందగీ అడ్డం తిరుగుతాడు. తగాదా తుదకు కోర్టుకెక్కింది. కార్వాయి నడిచి నడిచి బందగి వైపే ఫైసలా అయింది. బక్క రైతుకు భూమి దక్కటాన్ని జీర్ణించుకోలేని దేశముఖ్ బందగీని హత్య చేయించాడు. పారిన ఫకీరు నెత్తురు తెలంగాణ సాయుధ పోరాటానికి , ఇక్కడి భూ పోరాటాలకు జీవధార అయింది. 21వ శతాబ్దం.. 60 ఏళ్ల కల సాకారమైంది. తెలంగాణ జననేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలు అడగకుండానే కమ్యూనిస్టులను మించిన ఎజెండాను రూపొందించి అమలు చేశారు. 70 ఏళ్లుగా లొసుగులతో సాగిన భూ రికార్డులను ప్రక్షాళన చేశారు. ఎవరి హద్దులు వాళ్లకు చూపించి బీద, బిక్కీ, బడుగు, బక్క రైతుల భూములకు ఎవరికి వారివి పక్కాగా పట్టా చేసి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.55 కోట్ల వ్యవసాయ భూమి ఉండగా వివాదరహితంగా ఉన్న 2.38 కోట్ల ఎకరాల భూమికి పక్కాగా పాసుబుక్కులు తయారు చేసి ఇచ్చారు. మిషన్ కాకతీయ పథకం కింద చెరువులను పునరుద్ధరణ చేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కాళేశ్వరం, సీతారామ సాగర్ ఒక్కొక్క ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ కృష్ణా, గోదావరి జలాలను కాలువలకు మళ్లించి చెరువులను నింపారు. ఆర్థికంగా చితికిపోయిన అన్నదాతలకు చేయూతనిచ్చి సాగును గాడిలో పెట్టేందుకు ‘రైతుబంధు’ పథకాన్ని అమలు చేశారు. దీంతో చిగురించిన చెట్టు మీదికి పిట్టలు వచ్చి వాలినట్లుగా వలసపోయిన జనాలు తిరిగి సొంతూళ్లకు చేరుకున్నారు. కొత్త ఆశలతో సాగుకు సిద్ధమయ్యారు. కమతం మీదికి సాగుకు వచ్చిన సన్న, చిన్నకారు రైతులకు అక్కడక్కడ మళ్లీ బందగీ అనుభవాలే ఎదురవుతున్నాయి. బడా పెట్టుబడిదారుల వైపు నిలబడిన పోలీసులు, లేని సమస్యలను ఉత్పన్నం చేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికి మొగ్గు చూపిస్తున్నారు. వందలాది ఎకరాలను కొనుగోలు చేసి భూముల చుట్టూ పెన్సింగ్ వేసి ఏక ఖండిక కమతాలుగా మార్చుకున్న పెట్టుబడిదారులు మధ్యలో ఉన్న వలస కూలీలకు చెందిన ఎకరం, అర ఎకరం భూములను అక్రమంగా కలిపేసుకున్నారు. సొంత భూములలో సాగు చేసుకునేందుకు తిరిగి వచ్చిన వలస కూలీలు లబోదిబోమంటూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి పట్టా దారి హక్కు పుస్తకాలు సంపాదించుకుని వస్తే పోలీసులు లాఠీలు పట్టుకొని గెట్టుకు అడ్డంగా, కబ్జాదారులకు అండగ నిలబడుతున్నారు. కబ్జా మీద ఎవరు ఉంటే వారిదే భూమి అనే చట్టవిరుద్ధ నిబంధనలను అమలు చేస్తున్నారు. పట్టాదారుల మీద ఆక్రమణ కేసులు బనాయిస్తున్నారు. హైదరాబాద్ సమీపంలో ఉన్న మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలతో పాటుగా కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఈ సమస్యలు విపరీతంగా ఉత్పన్నమవుతున్నాయి. బాధితుల అభ్యర్థన మేరకు నా నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ను సంప్రదిస్తే ‘రెవెన్యూ రికార్డులతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతానికి భూమి ఎవరి అధీనములో ఉందో వారే హక్కుదారులు. భూమి మీదికి వెళ్ళినవారు ఆక్రమణదారులు. అటువంటి వారిపై అక్రమ కేసులు పెడతాం’ అన్నారు. డీజీపీ ఆదేశాలమేరకే నడుచుకుంటున్నామని మరో సమాధానం చెప్పాడు. ఆయన చెప్పిన సమాధానంతో అవాక్కయ్యాను. పట్టా రైతుకు అన్యాయం జరుగొద్దనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తమ తీరు మార్చుకోకపోతే గతంలోలాగే మళ్లీ ప్రజల్లో అశాంతి రగిలే అవకాశం ఉంది. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, అంచనాలు పద్దుల కమిటీ చైర్మన్, మొబైల్ 9440380141 -
గిట్టుబాటు ధర ముందే ప్రకటిస్తాం : సీఎం జగన్
సాక్షి, అమరావతి : తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలో రైతు భరోసాపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబులా మోసం చేసే ప్రభుత్వం తమది కాదని అన్నారు. రైతుల కోసం నాలుగు అడుగులు ముందుకు వేసే ప్రభుత్వం తమదని తెలిపారు. పంటలకు ముందే గిట్టుబాటు ధర ప్రకటిస్తామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ఏ పంటకు ఎంత రేటో గురువారం పత్రికా ప్రకటన ఇస్తామని చెప్పారు. రైతులకు టీడీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన రూ. 960 కోట్లను తాము చెల్లించామని తెలిపారు. బ్యాంక్‌లు రైతులకు లోన్లు ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారు : బుగ్గన టీడీపీ హయాంలో ఎంత రుణమాఫీ చేశారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. మంగళవారం రోజున అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు రుణమాఫీ హామీతో రైతులను మభ్యపెట్టారని తెలిపారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నో రకాలుగా హడావుడి చేశారని చెప్పారు. గత ప్రభుత్వం బ్యాంక్‌లు రైతులకు లోన్లు ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారని విమర్శించారు. నీరు-చెట్టు పథకం పేరుతో టీడీపీ నేతలు వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభవ పథకానికి కూడా డిస్కమ్ నిధులు వాడారని మండిపడ్డారు. కష్టం వస్తే నేనున్నానని చెప్పే సీఎం వైఎస్ జగన్ : కన్నబాబు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు ఒక్క కౌలు రైతుకైనా మేలు చేశారా అని ప్రశ్నించారు. కౌలు రైతులకు మేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని స్పష్టం చేశారు. ఒక్క గింజ ధాన్యం కూడా వదలకుండా కొనుగోలు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు. చంద్రబాబుకు వ్యవసాయం గురించి ఏమి తెలియదని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీకి చంద్రన్న దగా అని పేరు పెట్టాలని ఎద్దేవా చేశారు. కష్టం వస్తే నేనున్నానని చెప్పే సీఎం వైఎస్ జగన్ అని అన్నారు. రైతు భరోసా కార్యక్రమం అద్భుతంగా జరుగుతోందని చెప్పారు. చంద్రబాబు ప్రతి ఒక్క రైతును మోసం చేశారని విమర్శించారు. ఐదేళ్లలో చంద్రబాబు విఫలం కావడంతోనే ప్రజలు సరైన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా అందజేస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. -
చంద్రబాబులా ప్రచారం చేసుకోలేదు
సాక్షి, అమరావతి : అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా అమలు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అందిస్తున్నామని చెప్పారు. కేంద్రం నిధులతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబులా ప్రచారం చేసుకోలేదని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజనగా అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని చెప్పాం.. కానీ దానిని రూ.13,500కు పెంచామని గుర్తుచేశారు. మేనిపెస్టోలో నాలుగేళ్లు అని చెప్పినప్పటికీ.. రైతుల కోసం ఐదేళ్లు రైతు భరోసా అమలు చేయనున్నట్టు మరోసారి స్పష్టం చేశారు. ఈ క్రమంలో పెట్టుబడి సాయం రూ. 50వేల నుంచి రూ. 67,500కు పెంచామని అన్నారు. చంద్రబాబు నాయుడు చివరి నాలుగు నెలలు ఎన్నికల కోసం పథకాలు ప్రవేశపెడితే.. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. 2014 ఎన్నికలకు ముందు రుణమాఫీ ప్రకటించిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే దానిని తగ్గించారని మండిపడ్డారు. రైతు భరోసా ద్వారా రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చామని తెలిపారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు : మోపిదేవి అనంతరం మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే వ్యవసాయ మిషన్ ప్రారంభించారని తెలిపారు. రైతు పంట వేసినప్పటి నుంచి గిట్టుబాటు ధర వచ్చేంత వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటోందని చెప్పారు. రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి.. గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని గుర్తుచేశారు. శనగ రైతులకు గిట్టుబాట ధర ఇచ్చి ఆదుకున్నామని పేర్కొన్నారు. రైతు బజార్లలో తక్కువ ధరకే ఉల్లి, టమోటా అందిస్తున్నామని తెలిపారు. ఓ వైపు రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తూ.. అదే సమయంలో వినియోగదారుడిపై భారం లేకుండా చూస్తున్నామని చెప్పారు. ఎక్కడిక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రైతు ఏ పంట పండించినా ఈ క్రాప్ నిబంధనలు సడలిస్తున్నామని పేర్కొన్నారు. 24 గంటల్లోనే ఈ క్రాప్ బుకింగ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలని ఎద్దేవా చేశారు. వరుణుడు, వైఎస్సార్ ఫ్యామిలీ కవల పిల్లలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో రైతులు నిర్లక్ష్యానికి గురయ్యారని మండిపడ్డారు. -
బీజేపీ ఓటమి వెనక..
15 ఏళ్లుగా అధికారంలో కొనసాగడంతో ప్రభుత్వ వ్యతిరేకత తలెత్తడం సహజమే. కానీ ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఓటమికి గ్రామీణ జీవన సంక్షోభం, రైతు సమస్యలు, నక్సల్స్ సమస్య సహా పలు అంశాలు కారణమయ్యాయి. 2013లో కేవలం లక్ష ఓట్ల తేడాతో (0.7శాతం) మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి భారీగా నష్టపోయింది. ► వ్యవసాయ సంక్షోభంపై దృష్టిసారించకపోవడం రమణ్‌సింగ్ సర్కారుపై వ్యతిరేకత పెంచింది. 2013లో రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరుతూ.. 2017లో సీఎం నియోజకవర్గమైన రాజ్‌నంద్‌గావ్‌లో 50,000 మంది రైతులు ప్రదర్శన జరిపారు. ఎన్నికలకు రెండు నెలల ముందు (సెప్టెంబరులో) క్వింటాల్ వరికి రూ. 300 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ రైతులకు సర్కారుపై నమ్మకం కలగలేదు. మరోవైపు, తాము అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోగా రుణాలు మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వాగ్దానం చేయడం, మద్దతు ధరలకు హామీ ఇవ్వడం వంటికి రైతాంగాన్ని ప్రభావితం చేశాయి. ► రూ.36000 కోట్ల పౌర సరఫరాల కుంభకోణంలో రమణ్‌సింగ్, ఆయన భార్యకు పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడం, 60 మంది మరణానికి కారణమైన రూ.5000 కోట్ల చిట్‌ఫండ్ కుంభకోణ నిందితులపై ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం (310 ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి), పనామా పేపర్లలో సీఎం కుమారుడి పేరు ఉండటం, సహజ వనరుల్ని ధనికులకు కట్టబెట్టడం వంటి అంశాలు పాలక పార్టీని అపఖ్యాతి పాల్జేశాయి. కాంగ్రెస్‌కు ఇవే పెద్ద ప్రచారాస్త్రాలు అయ్యాయి. ► 2006లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టం అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు చేసిన వాగ్దానం పని చేసింది. ఈ చట్టాన్ని బీజేపీ నీరుగారుస్తుందనేది కాంగ్రెస్ ఆరోపణ. బీజేపీ హయాంలో అటవీ ఉత్పత్తుల కనీస మద్దతు ధర తగ్గిపోవడాన్ని కూడా కాంగ్రెస్ ప్రముఖంగా ప్రచారం చేసింది. ► రమణ్‌సింగ్ సర్కారులోని అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దీన్ని అధిగమించేందుకు కొత్త ముఖాలను బరిలోకి దింపాలన్న ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. టికెట్ల కేటాయింపులో అధిష్టానం మాటే చెల్లుబాటయ్యింది. ► నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరగడం (రాష్ట్రంలో ఇంచుమించు 40 లక్షల మంది నిరుద్యోగులున్నది ఒక అంచనా), ఆదివాసుల భూములను పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం, సాగునీటి వనరుల గురించి బీజేపీ సర్కారు పట్టించుకోకపోవడం వంటి అంశాలు కూడా కొంతమేరకు ప్రభావితం చూపాయి. నోట్ల రద్దు పర్యవసానాలు, జీఎస్టీ అమలు కూడా పాలక పార్టీపై కొంత వ్యతిరేకతకు కారణమైనట్టు విశ్లేషకులు చెబుతున్నారు. -
'భోజనం చేశాక బాగా మాట్లాడుకోవచ్చు'
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ముగిశాక తెలంగాణ అసెంబ్లీలో కొన్ని అప్యాయతతో నిండిన మాటలు వినిపించాయి. రైతుల ఆత్మహత్యల విషయంపై తాను సలహాలు ఇవ్వాలనుకుంటున్నకాంగ్రెస్ నేత జానారెడ్డి మాట్లాడుతూ తన సలహా సుదీర్ఘంగా ఉంటుందని, మీకు అభ్యంతరం లేకుంటే సగం ఇప్పుడు.. మరో సగం భోజన కార్యక్రమం ముగించుకొని వచ్చాక చెబుతానని సభకు తెలియజేశారు. లేదంటే సభ్యులు భోజనం పూర్తి చేశాకే మాట్లాడదామని, అంతా మీ ఇష్టం అని అన్నారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. 'భోజనం చేస్తేనే బాగా మాట్లాడుకుంటాం, విస్తృతంగా చర్చించుకుంటాం. అందుకే భోజనం తర్వాత మీ సలహాలు ఇవ్వండి' అని అన్నారు. అందుకు జానారెడ్డి స్పందిస్తూ భోజనం చేశాక మీరూ వస్తారా అని ప్రశ్నించగా తప్పకుండా వస్తాను.. అందరం మంచిగా చర్చించుకుందాం అదేందే అట్లాంటారు. భోజనం చేసి వద్దాం నో ప్రాబ్లమ్' అనగానే సభలో నవ్వులు విరిశాయి. దీంతో స్పీకర్ సభను అరగంట పాటు భోజన కార్యక్రమం కోసం వాయిదా వేశారు. -
'మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయ అన్నారు'
హైదరాబాద్: రైతుల ఆత్మహత్యల సమస్య రాత్రికి రాత్రే పరిష్కారం అయ్యేది కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దీని నివారణ కోసం స్వల్ప మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం అని చెప్పారు. రెండు రోజులపాటు అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యలపై చాలా చక్కగా సుదీర్ఘ చర్చ జరిగిందని, అయితే, ప్రతిపక్షాల నుంచి మంచి సలహాలు, సూచనలు వస్తాయని అనుకున్నాను కాని నిరాశపరిచారని చెప్పారు. రైతుల ఆత్మహత్యల నివారణ కోసం సమస్య మూలాల్లోకి వెళ్లి పరిశీలించాలని హైకోర్టు చక్కటి సలహా ఇచ్చిందని, అందుకు ధన్యవాదాలని చెప్పారు. రైతుల ఆత్మహత్యలకు ప్రధానంగా రెయిన్ షాడో, కరువులు, అడవులు నరికివేత, భూగర్భ జలాలు లేకపోవడం, మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు కరెంటు బిల్లులు, బకాయిలు, వ్యవసాయ శాఖలో పరిశోధనలలేమి కారణం అని చెప్పారు. వర్షాలు లేక పరిస్థితి దారుణంగా తయారైందని తాను కూడా ఓ 50 ఎకరాల్లో అల్లం పెట్టానని అది పండుద్దో ఎండుద్దో అర్థం కావడం లేదని తెలిపారు. ఇంకా ఏం చెప్పారంటే.. వ్యవసాయశాఖలో పరిశోధనలు కుప్పకూలాయి. ఉస్మానియాకు అనుభందంగా ఉన్న వ్యవసాయ వర్సిటీని విడదీసి ధ్వంసం చేశారు. నేడు రీసెర్చ్ లేకుండా పోయింది. నేను వ్యక్తులను, పార్టీలను నిందించడం లేదు. కాకతీయ రెడ్డి రాజుల పుణ్యమా అని 75 చెరువులు తవ్వించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్టు నిజాం సాగర్ ప్రాజెక్టు ఇరిగేషన్‌పై, రైతుల ఆత్మహత్య నివారణపై ఏ సలహాలు ఇచ్చినా స్వీకరిస్తాం భారత్‌లో ఎక్కడా లేని విత్తన కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయి ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే దశాబ్దాలుగా నిర్ర నీలుగుతున్నాయి 16 నెలల్లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రాజెక్టులు ఎలా ధ్వంసం చేస్తుంది పద్దులు కట్ చేసి రైతులను ఆదుకోవాలని చెప్పిన సూచన స్వీకరిస్తాం విద్యుత్ సమస్యను అధిగమించాం. అవకాశం ఉన్న ప్రాంతాలకు వెళ్లి విద్యుత్ కొన్నాం ఆంధ్రప్రదేశ్‌లో న్యాయం జరగదనే మలిదశ ఉద్యమం జరిగింది అద్భుతమైన నేలలు తెలంగాణ సొంతం తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ వరల్డ్ అవుతుందని సైంటిస్టులు చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల 300 విత్తన కంపెనీలు ఉన్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ నియామకాలే నెలలు పట్టాయి. దేశంలో 2.50లక్షల స్థాపిత విద్యుత్ ఉంది.. కానీ వాడుతుంది సగమే. నీళ్ల దోపిడి విషయంలో అన్ని సభల్లో చెప్పాం. సమైక్య రాష్ట్రంలో పెద్ద దగానే ఈ విషయంలో జరిగింది. అందరం వ్యవసాయ కుటుంబంలోనుంచి వచ్చాం. కరెంటు సమస్య లేకుండా తొలిసారి సభ జరుగుతుంది. రైతులకు ఎన్నిగంటలు చెప్పామో అన్నిగంటలు విద్యుత్ ఇస్తున్నాం 11 నెలలుగా పరిశ్రమలకు 24గంటల విద్యుత్ ఇస్తున్నాం క్వాలిటీ విద్యుత్ ఇస్తున్నాం. ట్రాన్స్ ఫార్మర్లు, మోటర్లు కాలడంలేదు. రిపేరు సంస్థలు మూతపడ్డాయి. కట్టెలు పాతి కరెంట్ తెస్తానని నేను ఎప్పుడూ చెప్పలేదు. తలకాయ ఉన్న ఏ ముఖ్యమంత్రి అలా చెప్పడు వచ్చే ఏడాది మార్చి తర్వాత ఉదయంపూటే రైతులకు ఎనిమిది గంటల విద్యుత్ ఇస్తాం 2018 గంటలు ముగిసే నాటికి రైతులకు 24గంటల త్రీఫేజ్ విద్యుత్ ఇస్తాం రూ.91,000 కోట్లతో విద్యుత్ సమస్యకు చెక్ పెట్టబోతున్నాం. దయచేసి రైతులు ఏ రైతు ఆత్మహత్యకు పాల్పడవద్దు. తెలంగాణ తెచ్చుకుంది రైతుల ఆత్మహత్యలు చూడటానికి కాదు. కాకతీయ రెడ్డి రాజులు ఇచ్చిన మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ దెబ్బతిన్నది. పంజాబ్‌కు చెందిన రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, నీళ్ల కోసం నిత్యం శ్రమించే వ్యక్తి రాజేందర్ సింగ్ వరంగల్ చెరువుపై పుట్టిన రోజు జరుపుకున్నారు. కాకతీయ మిషన్ ప్రారంభించకముందే కమిషన్ కాకతీయ అన్నారు. రైతులు స్పందించారు. లక్షల ట్రాక్టర్ల పూడిక తీసి పొలాల్లోకి వేసుకున్నారు ఇప్పటి వరకు ఆరు వేల చెరువుల పూడిక తీశాం. గత ప్రభుత్వం చేసిన 480 కోట్ల అగ్రికల్చర్, 60 కోట్ల హార్టికల్చర్ బకాయిలు మా ప్రభుత్వం చెల్లించింది. గతంలో ఆత్మహత్య చేసుకున్నవారిని కూడా నష్టపరిహారం చెల్లించే జాబితాలో చేర్చాం. దాని ప్రకారం 290మందికి ఎక్స్ గ్రేషియా చెల్లించాం. గతంలో విత్తనాల కోసం ఓ లడాయి, ఎరువుల కోసం ఓ లడాయి. క్యూలో చెప్పులు. లాఠీ ఛార్జీలు జరిగాయి, ఫైరింగ్ వరకు వెళ్లాయి. నేనే స్వయంగా విత్తన సమస్యకు గల కారణాలు రాష్ట్ర, కేంద్ర అధికారులను అడిగి తెలుసుకున్నాను. డిమాండ్‌లేని సమయంలో విత్తనాలు కొని దగ్గరపెట్టుకోవాలని అధికారులకు చెప్పాను. ఆ ప్రకారం సమస్యలు లేకుండా విత్తనాలు ఎరువులు చెల్లించాం. యూరియా ఇప్పటికీ బఫర్ స్టాక్ తీసుకొచ్చి సిద్ధంగా ఉంచాం. 1076 గోదాములు ఉన్నాయి. వాటి కెపాసిటీ 4లక్షల టన్నుల మాత్రమే. 17 లక్షల టన్నుల అదనపు నిల్వల కోసం గోదాములు నిర్వహిస్తున్నాం. డ్రిప్ ఇరిగేషన్ కోసం ఎస్సీ, ఎస్టీలకు 100శాతం, బీసీలకు 90శాతం సబ్సిడీ ఇచ్చాం. 2009-2014 మధ్య సీసీఐ 1,40 కింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తే.. ఒక్క ఏడాది తమ పాలనలో సీసీఐ 1,80 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు చేసింది. మార్చినాటికి తెలంగాణలోని అన్ని మండల కేంద్రాల్లో గోదాములు ఉంటాయి. ఎఫ్ఆర్ బీఎం కింద రూ.3వేల కోట్ల నిధులు రానున్నాయి. ప్రభుత్వం రక్షించలేని భూములు అమ్మకానికి పెడతాం. ప్రభుత్వ భూములు అమ్మితే రూ.2వేల కోట్ల నుంచి 3 వేల కోట్లు రావచ్చు. పన్నులు బకాయిలు రూ.4500 కోట్లు రావాలి. 600 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చాం. 364 సీడ్ కంపెనీలు ఉన్నాయి. వాటిని ఒక్కో మండలాన్ని దత్తత తీసుకొని అగ్రిమెంట్ బ్యాక్ ఇవ్వాలని కోరాం. వచ్చే జనవరిలోగా సగానికి పైగా మండలాల్లో విత్తన ఉత్పత్తి జరిగేలా, సీడ్ కంపెనీలు దత్తత తీసుకునేలా నేను బాధ్యత తీసుకుంటాను. దీర్ఘకాలికంగా ప్రణాళికలే రైతుల ఆత్మహత్యలు ఆపుతాయి. రీసెర్చ్‌తో ప్రొడక్టివిటీ పెంచాలి. 1280 టీఎంసీ కేటాయింపుల కృష్ణా, గోదావరి నీటిని రైతుల కోసం తెప్పించేందుకు ఇరిగేషన్‌పై 25 వేల కోట్లు ప్రతి సంవత్సరం కొనుగోలు చేస్తాం ఐదు వేల ఎకరాలకు ఒక అగ్రికల్చర్ అధికారి ఉంటారు. దయచేసి ఏ రైతు ఆత్మహత్య చేసుకోవద్దు. -
'రైతు ఏడిస్తే కేసీఆర్ ఏడుస్తారు'
హైదరాబాద్: రైతులు ఏడిస్తే తొలుత కళ్లల్లో నీళ్లు వచ్చేది ముఖ్యమంత్రి కేసీఆర్‌కేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. బుధవారం అసెంబ్లీ శాసనసభలో రైతుల ఆత్మహత్యల ఘటనపై మాట్లాడుతూ రైతుల విముక్తి సాధన ఉద్యమం కేసీఆర్ చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి ఏం చేసినా రైతుల కోసమే చేశారని, ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని, చెరువుల పూడిక తవ్వకాలు, హరిత హారం వంటి కార్యక్రమాలన్నీ కూడా రైతులకు భవిష్యత్ తరాల కోసమేనని చెప్పారు. ఎద్దు ఏడ్చినచోట ఎవుసం నిలవదని, రైతు ఏడ్చిన చోట రాజ్యం ఉండదని, రైతు ఏడిస్తే కేసీఆర్ ఏడుస్తారని తెలిపారు. రాజోలి బండ తూము పగులకొట్టినప్పుడు ప్రతిపక్షాలు నవ్వుతుంటే 102 డిగ్రీల జ్వరంతో ఉండి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పాదయాత్ర చేశారని అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణపై ప్రతిపక్ష పాత్రే, ఇప్పుడు ప్రతిపక్ష పాత్రే విపక్షాలు పోషిస్తున్నాయని, వారిది పూర్తిగా సవతి ప్రేమేనని బాల కిషన్ ఆరోపించారు. ఈ సమయంలో జానారెడ్డి జోక్యం చేసుకున్నారు. ఇప్పుడు రైతులకు కావాల్సింది భరోసా, ఆత్మస్థైర్యం అని చెప్పారు. కడుపులో నెలలు నిండని బిడ్డ గురించి ఆలోచించే తమ ముఖ్యమంత్రి రైతుల గురించి ఆలోచించకుండా ఎలా ఉంటారని, ఒక్కసారి అంతా గుండెమీద చేయి వేసుకొని ఆలోచించుకోవాలని తెలిపారు. -
'ఆత్మహత్యలంటే మూతిపై కొట్టమన్నారు'
హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితి సంక్షోభంలోకి వెళ్లిపోయిందని, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ శాసన సభలో రైతుల ఆత్మహత్యలపై మాట్లాడుతూ 16 నెలలుగా ప్రభుత్వం రైతుల విషయంలో నిర్లక్ష్యంగా ఉందని ఆరోపించారు. ఇప్పటివరకు 1400 మంది ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఒక్కమంత్రిగానీ, ముఖ్యమంత్రిగానీ వారి కుటుంబాలను పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో జరిగేది రైతు ఆత్మహత్యలు కాదని, గత ప్రభుత్వ పాలకుల లోపం వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయని స్వయంగా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి కేటీఆర్ అన్నారని చెప్పారు. ఆత్మహత్యలంటే మూతిపై కొట్టండి అంటూ మంత్రులు, లక్ష్మారెడ్డి, జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నవారు బాధ్యత లేకుండా మాట్లాడటం బాధాకరమని చెప్పారు. బ్యాంకులు రుణాల విషయంలో వడ్డీ మాఫీ లేదని, ప్రభుత్వం ఇచ్చిన ఇన్ స్టాల్ మెంట్స్ వడ్డీకే జమ చేస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల విషయంలో మారిటోరియం అమలు చేసిందన్నారు. దీంతోపాటు గత యాభై ఏళ్ల కింద ఉన్న వ్యవసాయ పరిస్థితిని నేటి వ్యవసాయ పరిస్థితిని వివరించారు. -
'మేం రైతు వ్యతిరేకులం కాదు'
హైదరాబాద్: నగరంలో రోడ్ల పరిస్థితిపై, చైన్ స్నాచింగ్‌లపై వాయిదా తీర్మానం తిరస్కరించడంపై మాట్లాడదామని తాము అనుకున్నామని, మంత్రి హరీశ్ రావు రైతులకు తాము వ్యతిరేకులమని వ్యాఖ్యానించడం సరికాదని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్‌లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, ఒక్క రోజే 13 చైన్ స్నాచింగ్‌లు జరిగాయని ఈ విషయం తీవ్రంగా ఉన్నందునే తాము వాయిదా తీర్మానం ఇచ్చామని ఆయన చెప్పారు. అది ఎందుకు స్పీకర్ తిరస్కరించారో వివరిస్తే బాగుంటుంది తప్పా ఇలా మంత్రి హరీశ్ రావు నిందలు వేయడం సరికాదని అన్నారు. ప్రభుత్వం తప్పకుండా రైతులకు భరోసా ఇవ్వాలని చెప్పారు. -
'మేం రైతు వ్యతిరేకులం కాదు'
-
'రైతు ఘోష పట్టదా.. రాజకీయ ఉపన్యాసాలేనా?'
హైదరాబాద్: రైతులపట్ల ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాడు అసెంబ్లీ శాసనసభ ప్రారంభమవగానే పలువురు సభ్యులు భిన్న విషయాలపై చర్చలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ స్థానాలు వదిలి పోడియం దగ్గరకు వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రి హరీశ్ రావు వారితీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఘోష మీకు పట్టదా? ఒట్టి రాజకీయ ఉపన్యాసాలు మాత్రం చేస్తారా, మీ చిత్త శుద్ధి ఇదేనా అని నిలదీశారు. ఇది సరైన పద్ధతి కాదని, ప్రభుత్వం అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. రైతులపై ప్రేమ లేదా? మీ సిన్సియారిటీ ఇదేనా ? మీ వ్యవహారం మొత్తం రైతులు చూస్తున్నారని ఎవరు రైతు సమస్యలు చర్చించకుండా అడ్డుకుంటున్నారో వారు అర్ధం చేసుకుంటారని చెప్పారు. రైతులకు పూర్తి స్థాయిలో సహకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధం ఉందని చెప్పారు. -
'రైతు ఘోష పట్టదా.. రాజకీయ ఉపన్యాసాలేనా?'
-
వాడి వేడిగా ఉంటుందా..!
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ముందు నిర్ణయించినట్లుగానే ప్రశ్నోత్తరాలు పక్కకు పెట్టి రైతుల ఆత్మహత్యల విషయంపైనే ప్రధాన చర్చ ప్రారంభించారు. మంగళవారం మొత్తం కూడా ఇదే అంశంపై వాడివేడిగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే, మంగళవారం నాటి సమావేశంలో అధికార పక్షం కాస్త ఓపిగ్గానే వున్నా నేడు మాత్రం ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు ప్రతిపక్షాలకు గట్టి బదులిచ్చే అవకాశం ఉంది. మంగళవారంనాటి సమావేశాల్లో ప్రారంభంలోనే వికారుద్దీన్ ఎన్ కౌంటర్ విషయంపైనే చర్చ జరపాలని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతోపాటు రైతుల ఆత్మహత్యలపై చర్చ ప్రారంభించినప్పుడు కూడా అక్బరుద్దీన్ అదే స్థాయిలో గొంతు పెంచారు. రైతులు విషయంలో ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోతుందని, మాటలకే పరిమితమవుతుందని గట్టిగా స్వరం వినిపించారు. ఈ క్రమంలో ఓసారి కేటీఆర్, అక్బరుద్దీన్‌కు మధ్య వాడివేడి మాటల యుద్ధం నెలకొంది కూడా. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంతకుముందు అక్బరుద్దీన్ విషయంలో జోక్యం చేసుకొని సర్ది చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం నాటి సమావేశాల్లో అలాంటి పరిస్థితి ఉండకూడదని ప్రభుత్వానిదే పైచేయిగా చేయాలని అధికార పక్షం సర్వత్రా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి సమావేశం ప్రారంభమై రైతుల ఆత్మహత్యల అంశంపై చర్చ జరుగుతోంది. -
'హాట్ హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ'
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభంకాగానే గందరగోళం నెలకొంది. వికారుద్దీన్ ఎన్ కౌంటర్ విషయంపై చర్చించాలని పేర్కొంటూ మజ్లిస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే, ఈ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో ఎట్టి పరిస్థితిలో ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పట్టుబట్టారు. దీంతో తొలుత స్పీకర్ మధుసూదనాచారి ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రైతుల సమస్యలపైనే ప్రధానంగా చర్చించాలని బీఏసీలో నిర్ణయించడమైందని అన్నారు. అప్పటికీ ఆయన వినకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని రైతుల ఆత్మహత్యలపైనే ప్రధాన చర్చ జరుగుతుందని స్పష్టం చేశారు. రెండు రోజులపాటు ఈ చర్చ జరిగిన తర్వాతే వికారుద్దీన్ ఎన్ కౌంటర్ అంశంపై చర్చ జరుపుకుందామని చెప్పారు. మంత్రి హరీశ్ రావు కూడా సభకు సహకరించాలని కోరడంతో చివరకు అక్బరుద్దీన్ వెనక్కు తగ్గి రైతుల అంశంపై చర్చ ప్రారంభమైంది.