హైదరాబాద్: రైతులపట్ల ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాడు అసెంబ్లీ శాసనసభ ప్రారంభమవగానే పలువురు సభ్యులు భిన్న విషయాలపై చర్చలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ స్థానాలు వదిలి పోడియం దగ్గరకు వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రి హరీశ్ రావు వారితీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల ఘోష మీకు పట్టదా? ఒట్టి రాజకీయ ఉపన్యాసాలు మాత్రం చేస్తారా, మీ చిత్త శుద్ధి ఇదేనా అని నిలదీశారు. ఇది సరైన పద్ధతి కాదని, ప్రభుత్వం అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. రైతులపై ప్రేమ లేదా? మీ సిన్సియారిటీ ఇదేనా ? మీ వ్యవహారం మొత్తం రైతులు చూస్తున్నారని ఎవరు రైతు సమస్యలు చర్చించకుండా అడ్డుకుంటున్నారో వారు అర్ధం చేసుకుంటారని చెప్పారు. రైతులకు పూర్తి స్థాయిలో సహకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధం ఉందని చెప్పారు.
'రైతు ఘోష పట్టదా.. రాజకీయ ఉపన్యాసాలేనా?'
Published Wed, Sep 30 2015 10:15 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement
Advertisement