టీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను ఓడించడానికి బాహుబలి వస్తాడని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సద్దుమణిగినా ఆ పార్టీలో అంతర్గతంగా రగులుతున్నట్టుగానే కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ బలంగా ఉన్నట్టు, కేసీఆర్‌ను ఓడించడానికి బయటనుంచి ఎవరో రావాలన్నట్టుగా జానారెడ్డి మాట్లాడారని పలువురు సీనియర్లు అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో అగ్రనేతగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న జానా స్వయంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీ శ్రేణుల మనో స్థైర్యాన్ని దెబ్బతీయదా అని ప్రశ్నిస్తున్నారు.