మీడియాతో మాట్లాడుతున్న జగదీశ్‌రెడ్డి. చిత్రంలో పూల రవీందర్, గంగాధర్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: ‘జానాబాబా 40 దొంగలు’అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన కుసంస్కారానికి నిదర్శనమంటూ సీఎల్పీ నేత జానారెడ్డి విమర్శించడాన్ని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తప్పుబట్టారు. రాష్ట్రాన్ని 60 ఏళ్లు పాలించి దోచుకున్న కాంగ్రెస్ నేతల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మంత్రి కేటీఆర్ కూడా అదే మాట అన్నారని, ఇందులో అనుచితమేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను నిత్యం బండ బూతులు తిట్టే కాంగ్రెస్ నేతలు నీతులు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. పార్టీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, ఎమ్మెల్సీలు గంగాధర్‌గౌడ్, పూల రవీందర్‌తో కలసి శుక్రవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో జగదీశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
గుడ్డలు ఊడదీసి కొడతాం, దవడలు పగులగొడతామంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే ఆ పార్టీ పెద్దలకు సంస్కా రం గుర్తురాలేదా అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. జానారెడ్డికి కాంగ్రెస్‌లో గౌరవం లేకు న్నా, సీఎం కేసీఆర్ గౌరవం ఇస్తున్నారని చెప్పారు. నల్లగొండ సభలో జాతీయ నాయకుల ముందే కాంగ్రెస్‌లో కొత్తగా చేరిన నాయకులు అసభ్యంగా మాట్లాడితే జానారెడ్డి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిపై ప్రజలు సంతో షంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలను ఇంటికి పంపించడానికే ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. మంత్రి కేటీఆర్ ప్రజల మెప్పు పొంది నాయకుడయ్యారని జగదీశ్‌రెడ్డి చెప్పారు. టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని, కాంగ్రెస్ నేతలకు చేతనైతే అసెంబ్లీలో మాట్లాడాలని సవాల్ చేశారు.
కాంగ్రెస్‌పైనే ప్రజాగ్రహం
తెలంగాణ వస్తే చీకటి రోజులు వస్తాయంటూ నాటి కాంగ్రెస్ నేత, ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బెదిరించారని...కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రజలు, రైతులకు 24 గంటల నిరంతర కరెంటును ఇస్తున్నామని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. విత్తనాల కోసం రోజుల తర బడి క్యూలలో నిలబెట్టిన పాలన కాం గ్రెస్ పార్టీదని... ఇంటికే విత్తనాలను పంపిస్తున్న పార్టీ తమదన్నారు. మోస కారి కాంగ్రెస్ నేతలపై ప్రజలకు కోపం ఉంటుందా లేక అన్ని హామీలనూ నెరవేరుస్తున్న టీఆర్‌ఎస్ మీద ప్రజలకు కోపం ఉంటుందా అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి వల్ల తెలంగాణ పేరు మూడేళ్లలోనే ప్రపంచంలో మారుమోగిపోతోందన్నారు. గ్రామస్థాయి నుంచి కుటుంబ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment