జానారెడ్డిని ఎవరాపుతున్నారు: కొప్పుల | koppula iswar on jana reddy | Sakshi
Sakshi News home page

జానారెడ్డిని ఎవరాపుతున్నారు: కొప్పుల

Published Mon, Oct 9 2017 2:03 AM | Last Updated on Mon, Oct 9 2017 2:03 AM

koppula iswar on jana reddy

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నో మాట్లాడాల్సి వస్తుందంటున్న జానారెడ్డిని ఎవరు ఆపుతున్నారని ప్రభుత్త చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ ప్రశ్నించారు. శాసన మండలి విప్‌ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, నారదాసు లక్ష్మణ్‌రావులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జానారెడ్డి ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడాలన్నారు. టీఆర్‌ఎస్‌కు పెరుగుతున్న ప్రజాదరణను ప్రతిపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయని విమర్శించారు.

రాష్ట్రంలో ప్రతిపక్షాలంటే కేవలం ఎన్నికల పార్టీలుగా మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. సింగరేణి నుంచే ఎన్నికల పతనం ప్రారంభం అవుతుందని హెచ్చరించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సింగరేణి ఎన్నికలను టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి వంటి వారు మలినం చేశారని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ కళ్లతో కోదండరాం చూస్తున్నారని, ఉన్న గౌరవాన్ని పోగొట్టుకున్నారన్నారు. నీతులు చెబుతున్న జానారెడ్డి తన పార్టీ నేతలకు బుద్ధి చెప్పాలన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement