
'మీరు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా'
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలను టీఆర్ఎస్లో చేర్చుకోవడంపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలపై తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు సమాధానమిచ్చారు. మంత్రి హరీష్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. అభివృద్ధిని చూసే ఇతర పార్టీ నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదా అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ లో చేరికపై ఇప్పుడు మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి, జానారెడ్డి.. అప్పుడు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. 'మీరు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా' అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలపై మండిపడ్డారు.