
మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్‌తో కలసి మాట్లాడుతున్న కుందూరు జానారెడ్డి
మిర్యాలగూడ: బీజేపీతో కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్లారని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్‌తో పాటు పలువురు మైనార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్‌కు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు వస్తే రాష్ట్రంలో ఎంఐఎంతో ఒప్పందం కుదరదని, అందుకే అటు బీజేపీతో, ఇటు ఎంఐఎంతో అవగాహన కుదుర్చుకోవడానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రూపొందించిన బంగారుతల్లి పథకానికి పేరుమార్చి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఇచ్చిన మాట నిలుపుకోలేని కేసీఆర్ మాయమాటలు చెబుతున్నారని, సకల జనులను మోసం చేసిన కేసీఆర్‌కు బుద్ధి చెప్పడం అవసరమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment