సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక, రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
జానారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తప్పదనుకుంటే బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని కామెంట్స్ చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలసి పని చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు అనేది.. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. బీజేపీపై పోరుకు, ఎన్నికలకు సంబంధం లేదన్నారు.
ఇక, జానారెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో మరోసారి కలకలం సృష్టించాయి. జానారెడ్డి కామెంట్స్‌పై తాజాగా టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ స్పందించారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌తో పొత్తు అనేది వెయ్యి శాతం సాధ్యం కాదు. జానారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే అనే చర్చను ఎవరూ నమ్మవద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక, అంతకు ముందు కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌కు పొత్తు ఉండదని క్లియర్ కట్‌గా చెప్పారు.
ఇది కూడా చదవండి: వచ్చే ఎన్నికల్లో నా కొడుకు పోటీ చేస్తాడు: జానారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment