తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అయిదో సీటుపై కన్నేసిన టీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టేందుకు నిర్ణయించింది. బుధవారం రాత్రికి అభ్యర్థులను టీఆర్ఎస్ ప్రకటించనుంది. కాగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం రేపటితో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే ప్రధాన పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ రాత్రికల్లా టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలు ప్రకటించనున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేత జానారెడ్డి ఈ రోజు ఉదయం టీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావుతో భేటీ అయిన విషయం తెలిసిందే.