శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. నామినేషన్ల పరిశీలన అనంతరం 5 స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారి వి.నరసింహాచార్యులు ప్రకటించా రు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో స్వతంత్ర అభ్యర్థిగా జాజుల భాస్కర్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయాలంటే 10 మంది ఎమ్మెల్యేలు బలపరుస్తూ సంతకాలు చేయాల్సి ఉంటుంది.