లోక్‌సభ ఎన్నికలలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తెలంగాణ రాష్ట్ర సమితి అప్రమత్తమైంది. ఉపఎన్నికలు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెల 31న పోలింగ్ జరగనుంది. మూడు స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు మధ్య పోటీ నెలకొంది. గతంలో నల్లగొండ స్థానంలో కాంగ్రెస్, మిగిలిన రెండుస్థానా ల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించాయి. లోక్‌సభ ఎన్నికల వరకు మూడు స్థానాల్లో కచ్చితంగా గెలుపు తమదే అనే ధీమా అధికార పార్టీలో ఉండింది.