మమ్మల్ని గెలిపించడానికి బాహుబలి వస్తాడు | bahubali will come to win for congress, says janareddy | Sakshi
Sakshi News home page

మమ్మల్ని గెలిపించడానికి బాహుబలి వస్తాడు

Published Fri, Mar 17 2017 5:43 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

మమ్మల్ని గెలిపించడానికి బాహుబలి వస్తాడు - Sakshi

మమ్మల్ని గెలిపించడానికి బాహుబలి వస్తాడు

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి బాహుబలి వస్తాడని ప్రతిపక్ష నేత కే జానారెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ నాశనమవుతుందని, ఆయన ఐరన్ లెగ్ అని వస్తున్న విమర్శలపై జానారెడ్డి స్పందిస్తూ.. రాహుల్ ఐరన్‌ లెగ్గో కాదో తర్వాత తేలుతుందని అన్నారు. ఆదర్శ రాజకీయాలకు తాను విత్తనం లాంటోడినని చెప్పారు. ఇక నుంచి తాను అసెంబ్లీలో బడ్జెట్‌పై మాట్లాడనని, ఎన్నిసార్లు చెప్పినా అవే లెక్కలు, అవే తప్పులని విమర్శించారు. వచ్చే ఏడాది అసెంబ్లీలో బడ్జెట్‌పై మాట్లాడేందుకు తమ పార్టీ ఎమ్మెల్యేలకు అవకాశమిస్తానని జానారెడ్డి చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement