ఫిరాయింపులపై పిటిషన్ వచ్చే వారానికి వాయిదా | petition On defection postpone to next week | Sakshi
Sakshi News home page

ఫిరాయింపులపై పిటిషన్ వచ్చే వారానికి వాయిదా

Published Thu, Jun 30 2016 6:37 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

ఫిరాయింపులపై పిటిషన్ వచ్చే వారానికి వాయిదా - Sakshi

ఫిరాయింపులపై పిటిషన్ వచ్చే వారానికి వాయిదా

ఫిరాయింపులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్‌లో శాసన సభ్యుల ఫిరాయింపులపై ఫిర్యాదు ను శాసన సభాపతి పట్టించుకోవడం లేదని, వాటిని తక్షణం పరిష్కరించేలా సభాపతిని ఆదేశించాలని వైఎస్సార్‌సీపీ మే 13న దాఖలు చేసిన పిటిషన్ గురువారం సుప్రీం కోర్టులో విచారణకు స్వీకరించింది.

 

జస్టిస్ అనిల్ ఆర్.దవే, జస్టిస్ లావు నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం వద్దకు ఈ పిటిషన్ విచారణకు రాగా.. తమ తరపు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేనందున వచ్చే వారానికి వాయిదావేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది పూజా ధార్ విన్నవించారు. ఈ సందర్భంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు స్పందిస్తూ ఇది రాష్ట్రానికి చెందిన అంశమైనందున హైకోర్టుకు వెళ్లొచ్చు కదా? అని పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాది అందుబాటులో లేరని విచారణ వాయిదా వేయాలని మరోసారి పిటిషనర్లు కోరారు. ధర్మాసనం అందుకు సమ్మతించి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement