సుప్రీం న్యాయమూర్తితో విచారణకు సిద్ధపడాలి | To prepare for the trial judge to the Supreme | Sakshi
Sakshi News home page

సుప్రీం న్యాయమూర్తితో విచారణకు సిద్ధపడాలి

Published Thu, Mar 3 2016 1:46 AM | Last Updated on Tue, Oct 16 2018 3:40 PM

సుప్రీం న్యాయమూర్తితో విచారణకు సిద్ధపడాలి - Sakshi

సుప్రీం న్యాయమూర్తితో విచారణకు సిద్ధపడాలి

భూదోపిడీ వ్యవహారంలో బాబుకు మేకపాటి డిమాండ్

 సాక్షి, న్యూఢిల్లీ: భూదోపిడీకి పాల్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణకు సిద్ధపడాలని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  భూ దురాక్రమణలకు పాల్పడడం, బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేయడం వంటి నీచమైన పనులను ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత  లేదన్నారు.

‘ఎమ్మెల్యేల కొనుగోలు వంటి వ్యవహారాల్లో అవినీతి ఇమిడి ఉంటుందని ప్రధాని సులువుగా గ్రహించగలుగుతారు.  అలాంటప్పుడు చంద్రబాబుకు ప్రధాని వద్ద గౌరవం ఎలా లభిస్తుంది. ఆయన మాట ఎలా చెల్లుబాటవుతుంది. అందుకే ప్రత్యేకహోదా, రైల్వే జోన్, పోలవరం వంటి విషయాల్లో చంద్రబాబు కేంద్రాన్ని డిమాండ్ చేయడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి జేబులు నింపుకునేందుకు చేస్తున్న యత్నాలను ప్రజలు  అర్థం చేసుకుంటారు’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement