తెలంగాణకు వ్యతిరేకంగా సుప్రీంలో మేకపాటి పిటిషన్!
తెలంగాణకు వ్యతిరేకంగా సుప్రీంలో మేకపాటి పిటిషన్!
Published Wed, Feb 19 2014 9:45 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
న్యూఢిల్లీ: లోకసభ ఆమోదించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణను 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన ప్రతిపాదన ఆమోదిస్తూ అక్టోబర్ 3 తేదిన కేబినెట్ తీర్మానం చేయడం రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలని పిటిషన్ లో మేకపాటి పేర్కోన్నారు.
ప్రతిపాదిత ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013ను చట్టాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగ నిబంధనలు అతిక్రమించినట్టు ప్రకటించి.. ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం కోర్టుకు మేకపాటి విజ్క్షప్తి చేశారు. లోకసభలో ఆమోదం పొందిన తెలంగాణ బిల్లు ఇంకా రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది.
బిల్లుకు ఆమోదం తెలుపకముందు ముందుగా విచారణ చేపట్టడం సరికాదని.. సరియైన సమయంలో మళ్లీ పిటిషన్ దాఖలు చేయాలని.. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ఫిబ్రవరి 7, 17 తేదిల్లో సుప్రీం కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రవేశపెట్టిన బిల్లుకు ఫిబ్రవరి 18 తేదిన లోకసభ ఆమోదించిన తీర్మానాన్ని సవాల్ చేస్తూ ఫిబ్రవరి 19న మేకపాటి రాజమోహన్ రెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
Advertisement
Advertisement