సాక్షి, హైదరాబాద్: అధికారం, ధన బలంతోనే 30 శాతం మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులు జరిగాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఫిరాయింపులకు కారణమని సీఎం కేసీఆర్ చెప్పడం ఆయన నైతిక పతనానికి నిదర్శనమన్నారు. రాజ్యసభ ఎన్నికల అధికార ప్రకటన ప్రకారం ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పటికీ తాము గెలిచిన పార్టీల పేరుతోనే కొనసాగడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు తెలంగాణ వాదులు నడుం బిగించాలని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం అప్రజాస్వా మికంగా వ్యవహరిస్తోందని చాడ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment