విద్యుదాఘాతానికి రైతు బలి
విద్యుదాఘాతానికి రైతు బలి
Published Sun, Sep 4 2016 12:44 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
వీరారెడ్డిపల్లె(శిరివెళ్ల) వరి పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతును విధి విద్యుదాఘాతం రూపంలో బలి తీసుకుంది. బాధిత కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచింది. ఈ విషాద ఘటన శిరివెళ్ల మండలం వీరారెడ్డిపల్లెలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొండమడుగుల శ్రీరామరెడ్డి (32) రెండెకరాల సొంత పొలంతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పదిహేను రోజుల క్రితం పొలంలో వరినాట్లు పూర్తి చేశాడు. శనివారం ఎరువులు చల్లాలని భావించి శుక్రవారం రాత్రి నీరు పెట్టేందుకు వెళ్లి కరెంటు షాక్‌కు గురయ్యాడు. పొలానికి వెళ్లిన రైతు ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు శనివారం ఉదయం వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి గ్రామానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మతునికి రెండేళ్ల క్రితమే పెళ్లయింది. భార్య సాయిరాణి 7 నెలల గర్భిణి. తండ్రి కోటిరెడ్డి బనగానపల్లె ఆర్టీసీ డిపోలో డ్రై వర్‌గా పనిచేస్తూ అక్కడే కాపురముంటున్నాడు. కుమారుడి మరణంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Advertisement
Advertisement