పార్టీ ఫిరాయింపులపై 26న చర్చా గోష్టి | On 26 conference dedicated to the discussion on the Defection | Sakshi
Sakshi News home page

పార్టీ ఫిరాయింపులపై 26న చర్చా గోష్టి

Published Fri, Jun 24 2016 2:53 AM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM

On 26 conference dedicated to the discussion on the Defection

సీతంపేట: ‘పార్టీ ఫిరాయింపులు, ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపై ఈనెల 26వ తేదీన ద్వారకానగర్‌లోని విశాఖ పౌరగ్రంథాలయంలో మధ్యాహ్నం రెండు గంటలకు చర్చాగోష్టి జరుగుతుందని జనచైతన్య వేదిక రాష్ర్ట అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి తెలిపారు.

ఈ చర్చా గోష్టిలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇ.ఎ.ఎస్.శర్మ, ప్రొఫెసర్లు వి. బాలమోహన్‌దాస్, కె.ఎస్.చలం, ప్రసన్నకుమార్, కె.తిమ్మారెడ్డి, జి.హరగోపాల్, బాబీవర్ధన్, సీనియర్ పాత్రికేయుడు వి.వి..రమణమూర్తి, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు శివశంకర్ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు.  ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆశించే అభ్యదయకాముకులు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు చర్చా గోష్టిలో పాల్గొనవలసిందిగా కోరారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement