విజయవాడ, సాక్షి: ఎన్నో అనుమానాల మధ్యే అసెంబ్లీ ఎన్నికల్లో 164 సీట్లు గెల్చుకుంది చంద్రబాబు టీడీపీ పార్టీ. ఆ వెంటనే ప్రతీకార రాజకీయాలు మొదలుపెట్టి.. అరాచక పాలన కొనసాగిస్తున్నారు. అయినా సంతృప్తి దక్కనట్లుంది. ఇప్పుడు సిగ్గుగుగా రాజకీయాల్లో ‘వన్ టైం సెటిల్‌మెంట్’ పథకాన్ని తీసుకొచ్చారాయన.
ఏపీలో చంద్రబాబు నాయుడు మరోసారి ఫిరాయింపుల ప్రయత్నాలపై చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే చట్ట సభ్యులకు డబ్బులు.. కాంట్రాక్టు ఆశలు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో కొందరి నుంచి ఛీత్కారాలు ఎదురవుతుండగా.. మరికొందరు మాత్రం ఆ ఒప్పందాలకు లొంగిపోయినట్లేనని టీడీపీ అనుకూల మీడియా కథనాలు ఇస్తోంది.
టీడీపీ పుట్టినప్పటి నుంచి రాజ్యసభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఖాళీ స్థానాల కారణంగా రాజ్యసభలో జీరో అయ్యింది సైకిల్ పార్టీ. ఆ అవమానం నుంచి ఎలాగైనా బయటపడాలనే.. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ఎంపీలకు ఎర వేస్తోంది. తద్వారా తన వారికి ఆ పదవుల్ని ఇచ్చుకునేందుకు వ్యూహం రచిస్తోంది. తమ తమ పదవులకు ఆ ఎంపీలతో రాజీనామా చేయించి.. కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరాలని ఒత్తిడి సైతం చేస్తున్నట్లు సమాచారం. అదే టైంలో.. శాసనమండలిలోనూ టీడీపీ సభ్యుల సంఖ్య స్వల్పంగానే ఉంది. దీంతో.. మండలిలోనూ బలం పెంచుకునేందుకు బేరసారాలు మొదలుపెట్టింది.
చంద్రబాబుది నరం లేని నాలుక అని మరోసారి రుజువైంది. అధికారం చేపట్టాక.. వైఎస్సార్‌సీపీ నేతల్ని ఎట్టిపరిస్థితుల్లో చేర్చుకోమని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. మూడు నెలలు తిరగకముందే ఆ దిశగా కుటిలయత్నాలు ముమ్మరం చేశారు. ఏపీలోని కొన్ని నగరాల వైస్సార్‌సీపీ మేయర్లను ఇప్పటికే తమ పార్టీల్లోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు.. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలతో బేరసారాలు మొదలుపెట్టారు.
విలువలతో సాగుతున్న జగన్..
ఎన్టీఆర్ ఎపిసోడ్ , ఓటుకు నోటు ఎపిసోడ్‌ల రూపకర్త అయిన బాబు నుంచి ఈ తరహా రాజకీయం ఊహించిందే. కానీ, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. తాను అధికారంలో ఉన్నన్నాళ్లు విలువలున్న రాజకీయాలనే నడిపించారు.. ఇప్పటికీ నడిపిస్తున్నారు కూడా. ఫిరాయింపులను ఆయన ఏనాడూ ప్రొత్సహించలేదు. గతంలో పొత్తు కాకుండా.. సొంతంగా 151 సీట్లు సాధించి అధికారం చేపట్టారు వైఎస్ జగన్. ఆ టైంలో మండలిలో తగిన బలం లేకపోయినా ఆయన పట్టించుకోలేదు. అదే టైంలో.. రాజ్యసభ సభ్యులను ప్రలోభపెట్టలేదు. కానీ, చంద్రబాబు మాత్రం వైఎస్సార్‌సీపీ లాగే సంపూర్ణ మద్దతు ఉన్నా.. తన నైజం బయటపెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment