సాక్షి,హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ రాజ్యాంగం పట్టుకొని ఫోజులు కొడుతారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణలో అదే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పుడుతుందని ధ్వజమెత్తారు.
మంగళవారం(జులై16)పార్టీ మారిన ఎమ్మెల్యే లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కేటీఆర్‌తో పాటు ఇతర బీఆర్‌ఎస్ నేతలు భేటీ అయ్యారు.
ఫిర్యాదు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు.మార్చి 18న దానం నాగేందర్ పై ఫిర్యాదు చేశాం.ఇతర ఎంఎల్ఏల విషయంలో కూడా అనర్హత వేటు వేయాలని కోరాము.పలువురు నేతలు బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో చేరి నాలుగు నెలలు అవుతుంది. వారిపై చర్యలు తీసుకోకపోతే అది స్పీకర్ పదవికే అవమానని తెలిపారు.
మూడు నెలల్లో పార్టీ మారిన ఎంఎల్ఏలపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా మణిపూర్‌లో పార్టీ మారిన ఎంఎల్ఏపై చర్యలు తీసుకున్నారు.ఇక్కడ కూడా పార్టీ మారిన బీఆర్ఎస్ ఎంఎల్ఏలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరినట్లు కేటీఆర్ చెప్పారు.
రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాందీ ఫోజులు
రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాందీ ఫోజులు కొడుతారు కానీ ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందే కాంగ్రెస్ ప్రభుత్వమని ఫైరయ్యారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన ఎంఎల్ఏ పై చర్యలు తీసుకోవాలని అక్కడ కాంగ్రెస్ కోరుతుంది. కర్ణాటక లో 50 కోట్ల చొప్పున కాంగ్రెస్ ఎంఎల్ఏ లను కొన్నారని అక్కడ ముఖ్యమంత్రి చెప్తున్నారు..పార్టీ మారబోమని గోవా కాంగ్రెస్ నాయకులతో రాహుల్ గాంధీ ప్రమాణం చేయిస్తున్నారు. కానీ తెలంగాణలో ఏదెచ్చగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment