పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయ పైశాచిక ఆనందం
వైఎస్సార్ సీపీ నేతలు అప్పిరెడ్డి, పార్థసారథి
విజయవాడ(చిట్టినగర్) : పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయ పైశాచిక ఆనందం పొందుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర పరిశీలకుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కె.పార్థసారథి విమర్శించారు. అధికార దాహంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల వెంట కార్యకర్తలెవరూ వెళ్లకపోవడం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరో మారు రుజువు చేసిందన్నారు. పాల ప్రాజెక్టు ఫంక్షన్ హాల్‌లో పశ్చిమ నియోజకవర్గ ముఖ్యనేతలతో శనివారం సమావేశమయ్యారు. పార్థసారథి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలనే బావనతో కార్యకర్తలపై పాత కేసులు తిరగతోడి కేసులు బనాయించాలని చెప్పడం, పార్టీ మారిన ఎమ్మెల్యేను విమర్శిస్తే దాడులు చేయించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు. దాడులను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నమని హెచ్చరించారు.
ప్రజా పోరాటాలకు పునాది..
పశ్చిమ నియోజకవర్గం ప్రజా పోరాటాలకు పునాది అవుతుందని పార్టీ నగర పరిశీలకుడు లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీలో చేరిన జలీల్‌ఖాన్, పోలీసులు కేసులు, అధికారులను పనులు చేయవద్దంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.
సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి జో గి రమేష్, రాష్ర్ట కార్యదర్శి కామా దేవరా జ్, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు ఎం.శివరాకృష్ణ, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ విశ్వనాథ రవి, నగర పాలక సంస్థ ఫ్లోర్‌లీడర్ బండి పుణ్యశీల, కార్పొరేటర్లు బుళ్లా విజయ్, షేక్. ఆసీఫ్, షేక్, బీబ్‌జాన్‌బీ, సంధ్యారాణి, ఎస్టీ సెల్ రాష్ర్ట నాయకుడు బి.శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్యకర్తల సమావేశం వాయిదా పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని ఆదివారం జరగాల్సిన వైఎస్సార్ సీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం వాయిదా వేశారు.