పార్టీ ఫిరాయింపులపై న్యాయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం అసెంబ్లీ ...
హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులపై న్యాయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ సీఎంగా కేసీఆర్ను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తామన్నారు. ఈరోజు సాయంత్రం ఫిరాయింపులపై గవర్నర్ నరసింహన్ను కలిసి ఫిర్యాదు చేస్తామని జీవన్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ ఎప్పుడూ ఫిరాయింపులను ప్రోత్సహించలేదని ఆయన అన్నారు. తనకు మద్దతు ఇచ్చిన వారినే పార్టీలో చేర్చుకున్నారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే కేసీఆర్లా ఫిర్యాయింపులకు వైఎస్ఆర్ ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అన్నారు.