కుళ్లిన మాంసంతో బిర్యానీ | Municipal Officials 20 Thousend Fine to Red Bawarchi in Rangareddy | Sakshi
Sakshi News home page

‘రెడ్‌ బావర్చి’కి రూ.20 వేల జరిమానా

Published Sat, Nov 2 2019 11:42 AM | Last Updated on Sat, Nov 2 2019 11:42 AM

Municipal Officials 20 Thousend Fine to Red Bawarchi in Rangareddy - Sakshi

జరిమానా విధిస్తున్న సిబ్బంది

ఇబ్రహీంపట్నం రూరల్‌: కుళ్లిన మాంసంతో బిర్యానీ తయారీ చేసి విక్రయిస్తున్న ఓ హోటల్‌పై మున్సిపల్‌ అధికారులు దాడి చేసి జరిమానా విధించారు. ఆదిబట్ల మున్సిపాలటీ పరిధిలోని మంగల్‌పల్లి గేట్‌ వద్ద ఇటీవల రెడ్‌ బావర్చి హోటల్‌ ప్రారంభమైంది. ఈ హోటల్‌లో కుళ్లిపోయిన కోడిమాంసం వాడుతున్నట్లు మున్సిపల్‌ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు శుక్రవారం ఆ హోటల్‌పై దాడి చేసి హోటల్‌ను పరిశీలించారు. ఈ పరిశీలనలో హోటల్‌లో కుళ్లిన మాంసం లభించింది. హోటల్‌ నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం సరికాదని, మరోసారి ఇలాంటిది పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా హోటల్‌కు రూ.20 వేలు జరిమానా విధించారు. ఈ దాడిలో మున్సిపాలిటీ సిబ్బంది రాజశేఖర్, సదానందం, పర్వతాలు, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement