
సాక్షి, అనంతపురం: జిల్లాలోని నగరపాలక సంస్థలో అవినీతి బయటపడింది. బిల్డింగ్ క్రమబద్ధీకరించేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. వివరాలు.. టౌన్ ప్లానింగ్ అధికారులు వినయ్, అలివేలమ్మ తన బిల్డింగ్ క్రమబద్ధీకరణకు రూ.4 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు సత్యనారాయణ ఆరోపణలు చేశాడు. అంతే కాకుండా లంచం డబ్బ కోసం ఆ అధికారులు తనని వేధిస్తున్నారని తెలిపాడు. తాజాగా టౌన్ ప్లానింగ్ అధికారులు లంచం అడిగిన ఓ వీడియోను బాధితుడు బయటపెట్టాడు.
రూ.లక్ష లంచం తీసుకుంటూ మున్సిపల్ ఉద్యోగి ఆయూబ్ కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను నెల రోజుల కిందట బాధితుడు తన సెల్ఫోన్‌లో రికార్డు చేశాడు. ఇటీవల మున్సిపల్ ఉద్యోగి ఆయూబ్ అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. టైన్ ప్లానింగ్ అధికారులు వినయ్, అలివేలమ్మ తరఫున ఆయూబ్ లంచం తీసుకున్నట్లు బాధితుడు ఆరోపించాడు. దీంతో పాటు అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది అవినీతిపై బాధితుడు సత్యనారాయణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment