‘ఏసీబీ’కి చిక్కిన మున్సిపల్‌ ఏఈ | Municipal AE Caught By ACB In Yellandu | Sakshi
Sakshi News home page

‘ఏసీబీ’కి చిక్కిన మున్సిపల్‌ ఏఈ

Published Wed, Jul 31 2019 10:57 AM | Last Updated on Wed, Jul 31 2019 10:57 AM

Municipal AE Caught By ACB In Yellandu - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ డీఎస్పీ ప్రతాప్‌, పట్టుబడిన మున్సిపల్‌ ఏఈ అనిల్ 

సాక్షి, ఇల్లెందు(ఖమ్మం) : ఇల్లెందు మున్సిపల్‌ ఏఈ అనిల్‌ ఏసీబీ వలలో చిక్కాడు. ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని మంగళవారం  పట్టుకున్నారు. నంబర్‌ 2 బస్తీకి చెందిన కాంట్రాక్టర్‌ సంపత్‌ మున్సిపాల్టీ లో వివిధ నిర్మాణ పనులు రూ.18 లక్షల బిల్లుకు గాను ఎంబీ రికార్డుకు రూ.75 వేలు ఏఈ లంచం అడిగాడు. కొద్ది రోజులపాటు బిల్లు కోసం ఇబ్బందులకు గురి చేస్తుండడంతో మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇల్లెందుకు చేరుకున్న ఏసీబీ అధికారులు కాంట్రాక్టర్‌ నుంచి ఏఈ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. మున్సిపాల్టీలో రూ.39 కోట్లతో మినరల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్స్‌ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా సంపత్‌ ఓ కాంట్రాక్టర్‌ నుంచి గుడ్‌విల్‌గా తీసుకుని పనులు చేపటాడు. ఇందుకు సంబంధించిన బిల్లుల విషయంలో జరుగుతున్ను జాప్యంపై ఆగ్రహం చెందిన సంపత్‌ ఏసీబీ దృష్టికి తీసుకొచ్చి ఏఈని పట్టించాడు. వరంగల్‌ డీఎస్సీ ప్రతాప్, ఇన్‌స్పెక్టర్‌లు రవి, క్రాంతికుమార్, రమణకుమార్, రవీందర్, పదిమంది సిబ్బంది దాడిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ ప్రతాప్‌ మాట్లాడుతూ అవినీతి, లంచగొండితనం నిర్మూలించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజలపై ఉందని, ఎవరైనా అవినీతికి పాల్పడితే టోల్‌ ఫ్రీ 1064 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.  
నాడు సీనియర్‌ అసిస్టెంట్‌ మనోహర్‌..  
మున్సిపాల్టీలో ఏఈ అనిల్‌ ఏసీబీ అధికారులకు చిక్కడం ఇదే మొదటిసారి కాదు. 2008లో సీనియర్‌ అసిస్టెంట్‌ మనోహర్‌ ఇంటి పన్ను విషయమై 21 ఏరియాకు చెందిన బిందె కుటుంబరావు దగ్గర నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిన విషయం విదితమే.    

బిల్లుల కోసం వేధించాడు: సంపత్‌ 
మున్సిపాల్టీలో 7వ వార్డులో చేసిన రోడ్డు పనికి బిల్లుల కోసం ఏఈ చుట్టూ తిరిగి విసిగిపోయి చివరికి ఏసీబీని ఆశ్రయించినట్లు కాంట్రాక్టర్‌ సంపత్‌ తెలిపాడు. మంగళవారం సాయంత్రం మున్సిపల్‌ కార్యాలయం వద్ద 7వ వార్డులో రూ.10 లక్షలతో డ్రెయినేజీ నిర్మాణం పనులు చేపట్టి బిల్లు కోసం 15 రోజుల పాటు తిరిగినా రికార్డు చేయలేదన్నారు. బిల్లులు చేయకుండా ఇబ్బందులకు గురి చేయడంతో పాటు డబ్బులు ఇస్తేనే ఎంబీ రికార్డు చేస్తానని స్పష్టం చేయడంతో ఏసీబీని ఆశ్రయించినట్లు పేర్కొన్నాడు. తాను ఇచ్చిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు పకడ్బందీగా వలపన్ని ఏఈని పట్టుకున్నట్లు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement