anti curruption bearau
-
అవినీతిపై సర్కార్ ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: నగరపాలక, పురపాలక సంస్థల్లో అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కార్యాలయాల్లో బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. గురువారం కూడా అనకాపల్లి, బొబ్బిలి, సామర్లకోట, ఏలూరు, మార్కాపురం, తిరుపతి, రాజంపేట, పుట్టపర్తి, నందిగామ మున్సిపాలిటీలు, కార్పొరేషన్, నగర పంచాయతీ కార్యాలయాల్లో పట్టణ ప్రణాళికా విభాగం రికార్డులను ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులు, అక్రమ నిర్మాణాలపై ఉదాసీన వైఖరి తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ‘14400’ టోల్‌ఫ్రీ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు ఈ దాడులు చేశారు. ముఖ్యంగా పట్టణ ప్రణాళిక విభాగంపై అధికంగా అవినీతి ఆరోపణలు వచ్చినట్టు సమాచారం. ఈ తనిఖీల్లో ఆరోపణలు రుజువైతే అవినీతిపరులపై కఠిన చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించనుంది. దీంతో అవినీతిపరుల్లో వణుకు మొదలైంది. కాగా ఏసీబీ తనిఖీలు శుక్రవారం కూడా కొనసాగనున్నాయి. గత కొన్నేళ్లుగా ఆరోపణలు.. మున్సిపల్, పట్టణ ప్రణాళిక విభాగాల్లోని సిబ్బందిపై గత కొన్నేళ్లుగా అవినీతి ఆరోణలు వస్తున్నాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా.. ఆస్తి పన్ను అసెస్మెంట్ చేసేందుకు సర్వే చేయాలన్నా ఎంతో కొంత ముట్టజెప్పాల్సిన దుస్థితి ఉంది. కొత్తగా భవన నిర్మాణం చేపట్టాలన్నా ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉండి, ఇంటి ప్లాన్ కూడా నిబంధనల మేరకు ఉన్నప్పటికీ ఏదో ఒక సాకుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్టు పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ)కి, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టరేట్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతిపరుల ఆటకట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 14400 టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులోకి తేవడంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలపై అధిక ఫిర్యాదులు అందాయి. దీంతో ఏసీబీ వాటిలో దాడులు ముమ్మరం చేసింది. ఏసీబీ తనిఖీలపై నివేదిక అందగానే తగిన చర్యలు తీసుకుంటామని సీడీఎంఏ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని 123 నగరపాలక, పురపాలక సంస్థలు, 4,132 వార్డు సచివాలయాల్లో ప్రజలకు కనిపించేలా ‘14400’ టోల్‌ఫ్రీ నంబర్ ప్రదర్శించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రణాళిక విభాగం నిర్లక్ష్యం.. సూళ్లూరుపేటలో రూ.2,00,960, జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి మున్సిపాలిటీలో రూ.38,200, పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయంలో రూ.35,560 అనధికార నగదును ఏసీబీ అధికారులు గత రెండు రోజుల్లో స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పలుచోట్ల సర్వే, ప్లాన్ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను కాలవ్యవధికి మించి పెండింగ్‌లో ఉంచినట్టు గుర్తించారు. అంతేకాకుండా అనధికార నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తేల్చారు. అలాగే నిబంధనల ప్రకారం కొన్ని భవనాలకు నిర్మాణాల అనుమతి రుసుం వసూలు చేయడంలో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది విఫలమయ్యారని.. రికార్డులను సైతం సరిగా నిర్వహించడం లేదని ఏసీబీ అధికారులు గుర్తించారు. -
లంచం అడిగితే ఈ యాప్ లో ఫిర్యాదు చేయొచ్చు: సీఎం వైఎస్ జగన్
-
అవినీతి నిర్మూలన కోసం సీఎం జగన్ కీలక నిర్ణయం
-
నెల్లూరు మున్సిపల్లో ఏసీబీ తనిఖీలు
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తనిఖీలు కలకలం రేపాయి. నెల్లూరు పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ సోదాలు చేసింది. ఈ సందర్బంగా కార్యాలయంలోని రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. పలు పనుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగినట్లు సమాచారం. -
షేక్‌పేట్ ఎమ్మార్వో సుజాత అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ భూవివాదం కేసులో ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం నుంచి సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ అధికారులు.. భూ వివాదం కేసులో ఆమె పాత్ర ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఎమ్మార్వో సుజాతను అరెస్ట్ చేసి, అనంతరం వైద్యపరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరికాసేపట్లో ఎమ్మార్వో సుజాతను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మార్వో సుజాత పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇంట్లో దొరికిన రూ.30 లక్షలకు ఆధారాలు చూపలేకపోయరని సమాచారం. ఇదే కేసులో ఇప్పటికే బంజారాహిల్స్ ఎస్సై రవి నాయక్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
ఎమ్మార్వో సుజాత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
-
ఎమ్మార్వో చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: షేక్‌పేట్ భూ వ్యవహారంలో ఎమ్మార్వో సుజాత మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆదివారం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో ఎమ్మార్వో సుజాతను అధికారులు సుదీర్ఘంగా విచారించిన కూడా ఇంట్లో దొరికిన రూ.30 లక్షలు, నగలు విషయంలో సుజాత ఆధారాలు చూపించలేదని తెలిసింది. శాలరీ డబ్బులు బ్యాంకు నుంచి డ్రా చేశానని సమాధానం చెప్పినట్లు సమాచారం. బ్యాంక్ నుంచి డ్రా చేస్తే డాక్యుమెంట్లు చూపించాలని ఏసీబీ అధికారులు అడిగినా కూడా ఆమె స్పందించ లేదని సమాచారం. సుజాత ఇంట్లో షేక్‌పేట్‌కు చెందిన మరిన్ని ల్యాండ్ డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. సోమవారం మరో ఆమెను విచారించే అవకాశం ఉంది. (రూ.30 లక్షలు ఎక్కడివి?) కాల్ లిస్టులు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు ఈ కేసులో సంబంధం ఉన్నట్లు అనుమానం ఉన్న అందరి కాల్‌లిస్ట్‌లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆర్డీవో వసంత కుమారిని అధికారులు విచారించారు. రెండు రోజుల పాటు ఆర్ఐ నాగార్జున రెడ్డి, ఎస్సై రవీందర్ నాయక్, ఎమ్మార్వో సుజాతలను సుదీర్ఘంగా అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ముగ్గురి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఆర్ఐ నాగార్జున రెడ్డి, ఎస్సై రవీందర్ నాయక్ లను రిమాండ్ కు తరలించారు. లంచం కేసులో సుజాత పాత్ర ఉందని తేలితే సుజాతను కూడా రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. (అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ. 3 లక్షలు డిమాండ్) -
ఇంట్లో దొరికిన రూ.30 లక్షలు ఎక్కడివి?
సాక్షి, హైదరాబాద్ : షేక్‌పేట భూవివాదం కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో ఎమ్మార్వో సుజాతను అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు తొమ్మిది గంటల విచారణ తర్వాత ఎమ్మార్వో సుజాతను ఇంటికి పంపించారు. ఇంట్లో దొరికిన రూ.30 లక్షలపై ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఆర్డీవో వసంత కుమారిని పిలిచి అధికారులు వివరాలు సేకరించారు. (చదవండి : అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ. 3 లక్షలు డిమాండ్) మరోవైపు ఆర్ఐ నాగార్జున రెడ్డి విచారణ కొనసాగుతోంది. మరికాసేపట్లో నాగార్జునరెడ్డిని రిమాండ్‌కు తరలించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎస్సై రవీంద్రనాయక్‌ను రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్‌లోని 4865 గజాల భూ వివాదంలో షేక్‌పేట ఆర్ఐ నాగార్జునరెడ్డి, బంజారాహిల్స్ ఎస్సై రవీందర్లను ఏసీబీ అధికారులు శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఆర్ఐ
-
రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన షేక్‌పేట ఆర్ఐ
సాక్షి, హైదరాబాద్: రూ.15 లక్షల లంచం తీసుకుంటూ షేక్‌పేట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు యజమాని నుంచి ఆయన రూ.50 లక్షలు డిమాండ్ చేసినట్టు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. బయానాగా రూ.15 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో ఆర్ఐ నాగార్జునను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదే స్థల వివాదంలో ఆర్ఐ నాగార్జునతో పాటు బంజారాహిల్స్ ఎస్సై రవీందర్ కూడా డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఎస్సై రవీందర్‌ను కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని ఒకటిన్నర ఎకరాల స్థల వివాదంలో వీరిద్దరూ లంచాలు డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఎస్సై రవీందర్‌పై ఆరోపణల నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. (చదవండడి: జీహెచ్ఎంసీ పరిధిలో పరీక్షలు వాయిదా) స్థల వివాదమిదే! బంజారాహిల్స్‌లో సయ్యద్ అబ్దుల్‌కు చెందిన స్థలాన్ని ప్రభుత్వం రెవెన్యూ స్థలంగా పేర్కొంది. స్థలం తమదేనంటూ సయ్యద్ అబ్దుల్ కోర్టుకెక్కారు. స్థలం సయ్యద్ అబ్దుల్‌దేనంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ బోర్డు తీసి సయ్యద్ అబ్దుల్ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో రెవెన్యూ శాఖ ఫిర్యాదు మేరకు సయ్యద్ అబ్దుల్పై కేసు నమోదైంది. స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు ఆర్ఐ నాగార్జున, బంజారాహిల్స్ ఎస్సై రవీందర్ 50 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. -
ఏసీబీకి నూతన డైరెక్టర్ జనరల్ నియామకం
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్ జనరల్ కుమార్ విశ్వజిత్‌ను బదిలీ చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. విశ్వజిత్ స్థానంలో రవాణాశాఖ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సీతారామాంజనేయులును ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఏపీపీఎస్సీ కార్యదర్శిగానూ సీతారామాంజనేయులుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక రవాణా, రహదారులు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఎం.తిరుమల కృష్ణబాబుకు రవాణాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదిలాఉండగా.. రాష్ట్రంలో అవినీతి నిరోధక చర్యల విషయంలో ఏసీబీ పనితీరు ఆశించిన మేర లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. (చదవండి : లంచం తీసుకోవాలంటే భయపడాలి) -
సిద్దిపేట అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి అరెస్ట్
-
207 మంది అవినీతిపరుల్లో 50 మంది వాళ్లే..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసుతో రెవెన్యూ యంత్రాంగంపై అందరి దృష్టి పడింది. ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూమిని కోల్పోతానేమోనన్న భయంతోనే విజయారెడ్డిని హత్యచేసినట్టు సురేశ్ మరణ వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా పనులు చేయకుండా రెవెన్యూ అధికారులు నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటారని రైతులు ఆరోపిస్తున్నారు. (చదవండి : అదే అతడికి అవకాశం.. ఆమెకు శాపం) లంచం లేనిదే రెవెన్యూశాఖలో ఫైలు కదలదన్న తీరుగా పరిస్థితులు దాపురించాయని వాపోతున్నారు. ఈనేపథ్యంలో రెవెన్యూ శాఖలో అవినీతి బాగోతం.. ఏసీబీ దాడుల్లో పట్టుబడిన అవినీతి అధికారుల పేర్లు మరోసారి తెరపైకి వచ్చాయి. గత రెండేళ్లలో 207 ప్రభుత్వ అధికారులు ఏసీబీకి చిక్కితే వారిలో 50 మంది రెవెన్యూ ఉద్యోగులే ఉండటం గమనార్హం. ఇక ఎవరికీ దొరకని అవినీతి అధికారులు నేటికీ దొరలుగానే చలామణి అవుతున్నారు..! (చదవండి : విజయారెడ్డి హత్య: నిందితుడు సురేశ్ మృతి) అవినీతి రెవెన్యూ అధికారుల్లో కొందరు.. రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల తహసీల్దార్ లావణ్య , వీఆర్వో అనంతయ్య రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మేడ్చల్ జిల్లా బాచుపల్లి డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట తహసీల్దార్ రవిరాజా కుమార్‌రావు,వీఆర్ఏ రామకృష్ణ రూ. లక్షా 4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహబూబాబాద్ జిల్లా మద్దివంచ వీఆర్వో సీరం శివరావు రూ.లక్షా 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వనపర్తి జిల్లా కొత్తకోట ఆర్దీఓ చంద్రా రెడ్డి, తహసీల్దార్ మల్లికార్జునరావు రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన మంచిర్యాల ఆర్డీవో గూడెం మనోహర్‌రావు రూ.42 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన యాదాద్రి జిల్లా సుద్దాల వీఆర్వో శ్రీనివాస్ రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన నిజామాబాద్ ఆర్మూర్ ఆర్దీఓ శ్రీనివాస్ రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల సర్వేయర్ రాజు లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన పంచాయతిజిల్లా సర్వేయర్ రవి కుమార్ అవినీతి అధికారుల చిట్టా కోసం క్లిక్ చేయడం : -
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎంఈవో
సాక్షి, ఉలవపాడు(ప్రకాశం) : చనిపోయిన టీచర్ కుటుంబానికి రావాల్సిన నగదుకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేయడానికి రూ.10 వేలు లంచం తీసుకుంటున్న ఎంఈవోను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఉలవపాడులోని మండల విద్యావనరుల కేంద్రంలో జరిగింది. బాధితుడు, ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. ఉలవపాడుకు చెందిన బడితల పద్మజ అదే మండలం అలగాయపాలెం పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ 2017 అక్టోబర్ 16న అనారోగ్యంతో మరణించింది. ఆ తర్వాత ఏడాదికి ఆమె కుమారుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ పరిస్థితుల్లో పద్మజ భర్త బడితల వెంకట రమణయ్య తన కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం కోసం మండల విద్యాశాఖాధికారి నాలి కోటేశ్వరరావును కలిశాడు. భార్య ఎర్నడ్‌లీవులకు సంబంధించి రూ.3 లక్షలు, కుమారుడు కూడా మరణించడంతో ఆ కుటుంబంలో మరొకరికి ఉద్యోగ అర్హత లేని కారణంగా ఇచ్చే ఎక్స్‌గ్రేషియా రూ.8 లక్షల కోసం ఫైలు పెట్టి తనకు రావాల్సిన నగదు వచ్చేలా చూడాలని కోరారు. డీఈఓను కలిసి అక్కడ నుంచి ఫైలు ఉలవపాడుకు వచ్చేలా చేశారు. ఈ ఏడాది సెస్టెంబరు 20న ఎంఈఓ కోటేశ్వరరావును కలిసి ఫైల్ పై సంతకం పెట్టాలని కోరగా అందుకు ఎంఈవో రూ.10 వేలు లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఈనెల 27న ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో సోమవారం ఉలవపాడు మండల విద్యావనరుల కేంద్రంలో రూ.10 వేలు లంచం తీసుకుంటున్న ఎంఈవోను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ గుంటూరు అడిషనల్ ఎస్పీ ఎç.Üసురేష్‌బాబు, సీఐలు ఎన్.రాఘవరావు, ఎ.వెంకటేశ్వర్లులు తన సిబ్బందితో దాడిలో పాల్గొన్నారు. నిందితుడిని అక్కడిక్కడే అరెస్టు చేసి, ఫైల్ సీజ్ చేశామని, అతడిని నెల్లూరు ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరుస్తామని అడిషనల్ ఎస్పీ సురేష్‌బాబు తెలిపారు. -
‘ఏసీబీ’కి చిక్కిన మున్సిపల్ ఏఈ
సాక్షి, ఇల్లెందు(ఖమ్మం) : ఇల్లెందు మున్సిపల్ ఏఈ అనిల్ ఏసీబీ వలలో చిక్కాడు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని మంగళవారం పట్టుకున్నారు. నంబర్ 2 బస్తీకి చెందిన కాంట్రాక్టర్ సంపత్ మున్సిపాల్టీ లో వివిధ నిర్మాణ పనులు రూ.18 లక్షల బిల్లుకు గాను ఎంబీ రికార్డుకు రూ.75 వేలు ఏఈ లంచం అడిగాడు. కొద్ది రోజులపాటు బిల్లు కోసం ఇబ్బందులకు గురి చేస్తుండడంతో మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇల్లెందుకు చేరుకున్న ఏసీబీ అధికారులు కాంట్రాక్టర్ నుంచి ఏఈ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. మున్సిపాల్టీలో రూ.39 కోట్లతో మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా సంపత్ ఓ కాంట్రాక్టర్ నుంచి గుడ్‌విల్‌గా తీసుకుని పనులు చేపటాడు. ఇందుకు సంబంధించిన బిల్లుల విషయంలో జరుగుతున్ను జాప్యంపై ఆగ్రహం చెందిన సంపత్ ఏసీబీ దృష్టికి తీసుకొచ్చి ఏఈని పట్టించాడు. వరంగల్ డీఎస్సీ ప్రతాప్, ఇన్స్పెక్టర్లు రవి, క్రాంతికుమార్, రమణకుమార్, రవీందర్, పదిమంది సిబ్బంది దాడిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ మాట్లాడుతూ అవినీతి, లంచగొండితనం నిర్మూలించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజలపై ఉందని, ఎవరైనా అవినీతికి పాల్పడితే టోల్ ఫ్రీ 1064 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. నాడు సీనియర్ అసిస్టెంట్ మనోహర్.. మున్సిపాల్టీలో ఏఈ అనిల్ ఏసీబీ అధికారులకు చిక్కడం ఇదే మొదటిసారి కాదు. 2008లో సీనియర్ అసిస్టెంట్ మనోహర్ ఇంటి పన్ను విషయమై 21 ఏరియాకు చెందిన బిందె కుటుంబరావు దగ్గర నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిన విషయం విదితమే. బిల్లుల కోసం వేధించాడు: సంపత్ మున్సిపాల్టీలో 7వ వార్డులో చేసిన రోడ్డు పనికి బిల్లుల కోసం ఏఈ చుట్టూ తిరిగి విసిగిపోయి చివరికి ఏసీబీని ఆశ్రయించినట్లు కాంట్రాక్టర్ సంపత్ తెలిపాడు. మంగళవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయం వద్ద 7వ వార్డులో రూ.10 లక్షలతో డ్రెయినేజీ నిర్మాణం పనులు చేపట్టి బిల్లు కోసం 15 రోజుల పాటు తిరిగినా రికార్డు చేయలేదన్నారు. బిల్లులు చేయకుండా ఇబ్బందులకు గురి చేయడంతో పాటు డబ్బులు ఇస్తేనే ఎంబీ రికార్డు చేస్తానని స్పష్టం చేయడంతో ఏసీబీని ఆశ్రయించినట్లు పేర్కొన్నాడు. తాను ఇచ్చిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు పకడ్బందీగా వలపన్ని ఏఈని పట్టుకున్నట్లు చెప్పారు. -
ఏసీబీ దాడుల్లో షాకింగ్ నిజాలు!
-
అవినీతిని నిరోధించేందుకు ఆన్ లైన్ విధానం
మంత్రి నాయిని నర్సింహారెడ్డి సాక్షి, హైదరాబాద్: అవినీతిని నిరోధించేందుకు, సమయాన్ని ఆదా చేసేందుకు ఆన్లైన్ విధానం ఎంతో ఉపయోగపడుతుందని హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సచివాలయంలో బ్రాయిలర్స్ శాఖలో ఆన్లైన్ అనుమతుల వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలు ఫిట్నెస్ సర్టిఫికెట్‌ని కూడా ఆన్లైన్ ద్వారా పొందవచ్చన్నారు. ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టయితే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న 2,700 బ్రాయిలర్స్‌కి సంబంధించి ఎలాంటి జాప్యం లేకుండా ఆన్లైన్ నుంచి సేవల్ని పొందవచ్చని బ్రాయిలర్స్ డెరైక్టర్ విజయకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని మున్సిపల్ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇతర పార్టీల అడ్రస్ గల్లంతైందన్నారు.