అవినీతిని నిరోధించేందుకు, సమయాన్ని ఆదా చేసేందుకు ఆన్‌లైన్ విధానం ఎంతో ఉపయోగపడుతుందని హోం, కార్మికశాఖ మంత్రి నాయిని
మంత్రి నాయిని నర్సింహారెడ్డి
సాక్షి, హైదరాబాద్: అవినీతిని నిరోధించేందుకు, సమయాన్ని ఆదా చేసేందుకు ఆన్‌లైన్ విధానం ఎంతో ఉపయోగపడుతుందని హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సచివాలయంలో బ్రాయిలర్స్ శాఖలో ఆన్‌లైన్ అనుమతుల వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలు ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ని కూడా ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చన్నారు. ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టయితే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న 2,700 బ్రాయిలర్స్‌కి సంబంధించి ఎలాంటి జాప్యం లేకుండా ఆన్‌లైన్ నుంచి సేవల్ని పొందవచ్చని బ్రాయిలర్స్ డెరైక్టర్ విజయకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని మున్సిపల్ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇతర పార్టీల అడ్రస్ గల్లంతైందన్నారు.