Ellandu
-
ఇల్లందు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు మున్సిపల్ కార్యాలయం ముందు ఉద్రిక్తత కొనసాగుతోంది. మూడో వార్డు కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావును ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారని మున్సిపల్ కార్యాలయం ముందు నాగేశ్వరరావు భార్య, కూతురు ఆందోళన చేస్తున్నారు. బలవంతంగా తన భర్తను కాంగ్రెస్ వాళ్లు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లందుల్లో నేడు జరగనున్న అవిశ్వాసానికి ముందు ఈ వ్యవహారంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలపడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడం వల్లే తమ భర్తను కాంగ్రెస్ వాళ్ళు బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లారని నాగేశ్వరావు భార్య ఆరోపిస్తోంది. ఇల్లందు మున్సిపల్‌కి సంబంధించి మొత్తం 24 మంది కౌన్సిలర్లలో 19 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ,ముగ్గురు ఇండిపెండెంట్ లు ,ఒకరు సీపీఐ, ఒకటి న్యూ డెమోక్రసీ చెందిన కౌన్సిలర్ ఉన్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే బీఆర్ఎస్ పార్టీకి 17 మంది కౌన్సిలర్లు అవసరం. ఇదీ చదవండి: కాంగ్రెస్ మాటల ప్రభుత్వం -
‘ఏసీబీ’కి చిక్కిన మున్సిపల్ ఏఈ
సాక్షి, ఇల్లెందు(ఖమ్మం) : ఇల్లెందు మున్సిపల్ ఏఈ అనిల్ ఏసీబీ వలలో చిక్కాడు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని మంగళవారం పట్టుకున్నారు. నంబర్ 2 బస్తీకి చెందిన కాంట్రాక్టర్ సంపత్ మున్సిపాల్టీ లో వివిధ నిర్మాణ పనులు రూ.18 లక్షల బిల్లుకు గాను ఎంబీ రికార్డుకు రూ.75 వేలు ఏఈ లంచం అడిగాడు. కొద్ది రోజులపాటు బిల్లు కోసం ఇబ్బందులకు గురి చేస్తుండడంతో మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇల్లెందుకు చేరుకున్న ఏసీబీ అధికారులు కాంట్రాక్టర్ నుంచి ఏఈ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. మున్సిపాల్టీలో రూ.39 కోట్లతో మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా సంపత్ ఓ కాంట్రాక్టర్ నుంచి గుడ్‌విల్‌గా తీసుకుని పనులు చేపటాడు. ఇందుకు సంబంధించిన బిల్లుల విషయంలో జరుగుతున్ను జాప్యంపై ఆగ్రహం చెందిన సంపత్ ఏసీబీ దృష్టికి తీసుకొచ్చి ఏఈని పట్టించాడు. వరంగల్ డీఎస్సీ ప్రతాప్, ఇన్స్పెక్టర్లు రవి, క్రాంతికుమార్, రమణకుమార్, రవీందర్, పదిమంది సిబ్బంది దాడిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ మాట్లాడుతూ అవినీతి, లంచగొండితనం నిర్మూలించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజలపై ఉందని, ఎవరైనా అవినీతికి పాల్పడితే టోల్ ఫ్రీ 1064 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. నాడు సీనియర్ అసిస్టెంట్ మనోహర్.. మున్సిపాల్టీలో ఏఈ అనిల్ ఏసీబీ అధికారులకు చిక్కడం ఇదే మొదటిసారి కాదు. 2008లో సీనియర్ అసిస్టెంట్ మనోహర్ ఇంటి పన్ను విషయమై 21 ఏరియాకు చెందిన బిందె కుటుంబరావు దగ్గర నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిన విషయం విదితమే. బిల్లుల కోసం వేధించాడు: సంపత్ మున్సిపాల్టీలో 7వ వార్డులో చేసిన రోడ్డు పనికి బిల్లుల కోసం ఏఈ చుట్టూ తిరిగి విసిగిపోయి చివరికి ఏసీబీని ఆశ్రయించినట్లు కాంట్రాక్టర్ సంపత్ తెలిపాడు. మంగళవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయం వద్ద 7వ వార్డులో రూ.10 లక్షలతో డ్రెయినేజీ నిర్మాణం పనులు చేపట్టి బిల్లు కోసం 15 రోజుల పాటు తిరిగినా రికార్డు చేయలేదన్నారు. బిల్లులు చేయకుండా ఇబ్బందులకు గురి చేయడంతో పాటు డబ్బులు ఇస్తేనే ఎంబీ రికార్డు చేస్తానని స్పష్టం చేయడంతో ఏసీబీని ఆశ్రయించినట్లు పేర్కొన్నాడు. తాను ఇచ్చిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు పకడ్బందీగా వలపన్ని ఏఈని పట్టుకున్నట్లు చెప్పారు. -
బాలికల ఆరోగ్యానికి ప్రభుత్వమే రక్ష!
సాక్షి, ఇల్లెందుఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినుల ఆరోగ్య రక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. 12 నుంచి 18 ఏళ్ల వయసులోపు బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ పంపిణీ చేస్తోంది. ఈ మేరకు మండలంలో ఉన్న 104 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు ఆరోగ్య రక్షణ కిట్లను రెండు దఫాలు పంపిణీ చేసింది. మండలం, పట్టణంలోని 1200 మంది ఆడపిల్లలకు కిట్లను అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆరోగ్య కిట్లను ప్రభుత్వం 2018–19 విద్యా సంవత్సరం నుంచి అందజేయడం ప్రారంభించింది. ప్రతి మూడు నెలలకోసారి పంపిణీ చేయాల్సి ఉండగా ఈ విద్యాసంవత్సరంలో రెండు సార్లు పంపిణీ చేసింది. ఎన్నికల సందర్భంగా మూడో దఫా నిలిచిపోయింది. ప్రభుత్వం అందజేసిన ఆరోగ్య రక్ష కిట్లలో వివిధ కంపెనీలకు చెందిన సబ్బులు, షాంపు బాటిల్స్, పౌడర్, టూత్ బ్రష్, పేస్ట్, దువ్వెన, స్టిక్కర్లు, నైలాన్ రబ్బర్లు, రబ్బర్‌బ్యాండ్, సానిటరీ నాప్కిన్స్ తదిరత వస్తువులున్నాయి. ఒక్కో కిట్ రూ.1600 విలువ చేస్తుంది. ఇలా ప్రతీ సంవత్సరం బాలికా ఆరోగ్య రక్ష పథకం ద్వారా ఆడపిల్లలకు కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించింది. విద్యార్థినులకు అందజేసే ఆరోగ్య రక్షణ కిట్లలో నాణ్యమైన వస్తువులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఆడపిల్లలకు తొలిసారి ఆరోగ్య రక్షణ కిట్స్‌ను పంపిణీ చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఇల్లెందు మండల విద్యాశాఖ అధికారులు దీని అమలుకు పక్కా ప్రణాళిక అడుగులు వేస్తున్నారు. విద్యార్థినులు సద్వినియోగం చేసుకుంటున్నారు.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యరక్ష కిట్లను విద్యార్థినులు సద్వినియోగం చేసుకుంటున్నారు. విద్యార్థినుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం హర్షణీయం. ఇప్పటికే రెండు దఫాలు విద్యార్థినులకు ఆరోగ్య రక్షణ కిట్స్‌ను అందజేశాం. –పిల్లి శ్రీనివాసరావు, ఎంఈఓ, ఇల్లెందు -
గురుకులం.. సమస్యలకు నిలయం..
సాక్షి, ఇల్లెందుఅర్బన్: పట్టణంలోని 24 ఏరియాలో ఉన్న బాలికల కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ గురుకుల పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది. చాలీచాలని గదుల్లో విద్యార్థినులు కాలం వెళ్లదీస్తున్నారు. పాఠశాలకు పక్కా భవనం లేదు. నిరుపయోగంగా ఉన్న సివిల్ కార్యాలయం భవనాన్ని గురుకులానికి అప్పజెప్పారు. పాఠశాలలో 5 నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులు సుమారు 320మంది ఉన్నారు. ఈ భవనంలో 18 గదులు ఉండగా వీటిల్లో 8గదుల్లో విద్యార్థినులకు విద్యాబోధన కొనసాగుతోంది. మిగిలిన గదుల్లో బస చేయడానికి వినియోగిస్తున్నారు. అరకొర గదుల వల్ల వరండాలోనే చిన్నారులకు విద్యాబోధన చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఒక్కో గదుల్లో సుమారు 40మందికి పైగా విద్యార్థినులు నిద్రిస్తున్నారు. పాఠశాలకు సింగరేణి నీరే దిక్కు. ఈ నీరు నెలలో ఐదారు రోజులు వరుసగా నిలిచిపోవుతుండటంతో విద్యార్థినుల బాధలు వర్ణనాతీతం. వేసవి కాలంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. ఆటస్థలం కరువు.. విద్యార్థినులకు ఆటస్థలం లేకుండాపోయింది. పాఠశాలకు సమీపంలో ఉన్న సింగరేణి ఆటస్థలాన్ని అప్పుడప్పుడు వినియోగించుకుంటున్నారు. సంపూర్తిగా ఆటస్థలం అందుబాటులో లేకపోవడంతో విద్యార్థినులు క్రీడలకు దూరమవుతున్నారు. క్రీడల్లో రాణించే సత్తా ఉన్న విద్యార్థినులు నిరుత్సాహానికి గురవుతున్నారు. పక్కాభవనం నిర్మాణానికి మంజూరు కాని నిధులు.. ఎస్సీ బాలికల గురుకులం పాఠశాలకు పక్కా భవనం నిర్మించేందుకు ప్రభుత్వం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కనే.. సుమారు 8 ఎకరాల భూమిని కేటాయించారు. కానీ నిర్మాణాకి నిధులు మంజూరు కాలేదు. దీంతో పనులు మొదలు కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పక్కా భవనం నిర్మాణానికి నిధులను మంజూరు చేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థినులకు వసతులు కొదువుగా ఉన్నాయి.. ఎస్సీ బాలికల గురుకులంలోని విద్యార్థినులకు సరిపడా గదులు లేకపోవడంతో కొంత మేరకు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా పక్కా భవనానికి స్థలం కేటాయించారు. కాని నిధులు మంజూరు కాకపోవడంతో నిర్మాణం జాప్యమవుతోంది. వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలంలో.. ఓ ఇంజనీరింగ్ భవనాకి గురుకులాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నాం. -ఎస్కె.పాషా, గురుకులం ప్రిన్సిపాల్, ఇల్లెందు -
కిరాణ షాపులో అగ్నిప్రమాదం
సాక్షి,గార్ల(ఇల్లందు): దీపావళి పండుగ వేడుకలు ఆనందంగా జరుపుకుని రాత్రి ఇంట్లో నిద్రించగా ముందున్న కిరాణ షాపులో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలకేంద్రంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గార్ల మండలకేంద్రంలోని మెయిన్ బజార్లో ఉన్న గోదా మహావీర్‌జైన్ కిరాణం షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. దుకాణం వెనుకభాగంలో నివసిస్తున్న యజమాని లేని చూసి కేకలు వేయగా ఇరుగుపొరుగు వారు వచ్చి నీళ్లు తెచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మహబూబాబాద్ నుంచి ఫైరింజిన్ వచ్చి మంటలు ఆర్పేసింది. అప్పటికే దుకాణంలోని సరుకులు మొత్తం కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.10లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. భవనం సైతం పూర్తిగా దెబ్బతిన్నది. ఫైరింజిన్ మరో 15 నిమిషాల ఆలస్యమై ఉంటే పక్క దుకాణాలకు సైతం మంటలు అంటుకుని పెనుప్రమాదం సంభవించేదని స్థానికులు పేర్కొంటున్నారు. -
సింగరేణి కార్యలయం ఎదుట ఆందోళన
ఇల్లందు: కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఇల్లందు సింగరేణి కార్యాలయం ఎదుట శనివారం ఉదయం కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను తీర్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని కార్మికులంతా కలిసి సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకారులను చెదరగొట్టారు. -
ఇల్లందులో దొంగలముఠా అరెస్ట్
ఇల్లందు : ఖమ్మం జిల్లా ఇల్లందు మండల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, కాపర్ వైర్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన దొంగలు ఇల్లందు పట్టణంలోని టౌన్-15 బస్తీవాసులు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న సీఐ నరేందర్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. -
తండ్రికి బదులు పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు..
ఇల్లెందు(ఖమ్మం): తండ్రికి బదులు కుమారుడు పరీక్ష రాస్తూ పట్టుబడిన సంఘటన ఖమ్మం జిల్లా ఇల్లెందులో వెలుగుచూసింది. వీఆర్వోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి భవిష్యత్తులో పదోన్నతి పొందాలనే ఉద్దేశంతో ఓపెన్ టెన్త్ పరీక్షలు రాయలని నిర్ణయించుకున్నాడు. కానీ పాఠ్యపుస్తకాలు చదవలేక తన బదులు కొడుకుతో పరీక్ష రాయించాడు. ఇది గుర్తించిన అధికారులు కొడుకుపై మాల్‌ప్రాక్టీస్ కేసు పెట్టి పోలీసులకు అప్పగించారు. గూండాల మండలం ముత్సాపురం గ్రామానికి చెందిన ఎం.జాన్ ఖమ్మంలో వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణత సాధించకపోవడంతో ప్రస్తుతం ఓపెన్ టెన్త్ ద్వారా విద్యార్హతను పెంచుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో తాను పరీక్షలు రాస్తే.. ఫెయిల్ కావడం ఖయమని నిర్ణయించుకొని తన బదులు డిగ్రీ పూర్తి చేసిన తన కొడుకును పరీక్షకు పంపాడు. ఇది గుర్తించిన ఎగ్జామినర్ పై అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు అతనిని పరీక్ష నుంచి బహిష్కరించి పోలీసులకు అప్పగించారు.