టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో జరగాల్సిన మ్యాచ్‌లపై ఉత్కంఠ వీడింది.
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో జరగాల్సిన మ్యాచ్‌లపై ఉత్కంఠ వీడింది. జస్టిస్ (రిటైర్డ్) ముకుల్ ముద్గల్ పర్యవేక్షణలో ఇవి జరుగుతాయని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. మ్యాచ్‌ల ఏర్పాటుకు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌డీఎంసీ) ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తుందని, అయితే కార్పొరేషన్ అధికారుల నుంచి ఢిల్లీ క్రికెట్ సంఘం అన్ని క్లియరెన్స్‌లను పొందాలని సూచించింది. ముద్గల్ లేకుంటే ఇరు వర్గాల మధ్య సమన్వయం కుదరక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుందని జస్టిస్ మురళీధర్, విభు బక్రూలతో కూడిన బెంచ్ తేల్చింది.