టీడీపీ నేతల కుట్ర భగ్నం.. | TDP Leaders Eye On Anantapur Municipal Corporation Treasury | Sakshi
Sakshi News home page

మున్సిపల్ కార్పొరేషన్ ఖజానా పై కన్నేసిన టీడీపీ నేతలు

Nov 8 2020 10:07 AM | Updated on Nov 8 2020 12:45 PM

TDP Leaders Eye On Anantapur Municipal Corporation Treasury - Sakshi

సాక్షి, అనంతపురం: రూ.8 కోట్లు  కాజేసేందుకు టీడీపీ నేతలు పన్నిన కుట్రను కమిషనర్‌ పీవీఎస్‌ మూర్తి భగ్నం చేశారు. ఎన్టీఆర్ మార్గ్ పనుల్లో టీడీపీ నేతల అక్రమాలు వెలుగు చూశాయి. అరెకరం స్థలానికి 9.63 కోట్ల పరిహారానికి తొలుత ప్రతిపాదనలు జరగ్గా, ప్రతిపాదనల తర్వాత స్థలం వివరాలను టీడీపీ నేతలు తారుమారు చేశారు. టీడీపీ హయాంలో చదరపు అడుగు 17వేల నుంచి 30వేలకు పెంచారు. పరిహారం డబ్బు రూ.9.63 కోట్ల నుంచి రూ.17 కోట్లకు పెంచారు.

టీడీపీ నేతలకు అప్పటి జాయింట్ కలెక్టర్, ఆర్డీవో సహకరించారు. లక్షల రూపాయల ముడుపులు చేతులు మారాయి. రూ.8 కోట్లు అదనంగా కాజేసే కుట్రను కమిషనర్ మూర్తి గుర్తించారు. పరిహారం రెట్టింపు చేసుకునేందుకు ప్రైం లోకేషన్ల వివరాలను టీడీపీ నేతలు జత చేయగా, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పరిశీలనలో అక్రమాలు బయటపడ్డాయి. మొత్తం రూ.17 కోట్ల పరిహారం నిలుపుదల చేశారుజ సమగ్ర వివరాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు మున్సిపల్ కమిషనర్ మూర్తి సిద్ధమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement