సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాలో ప్రజా సమస్యలు, నెరవేరని ఎన్నికల హామీలపై నేడు మున్సిపల్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఆఫీసు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ నాయకులను ముందుస్తుగా అరెస్ట్‌లు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ధర్నాకు పోలీసులు అనుమతిలేదని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించి కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు.. పోలీసుల హెచ్చరికలను ఖాతరు చేయకుండా ధర్నా చేసి తీరుతామని కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు. దీంతో, డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. అక్రమ అరెస్ట్‌లతో ఆందోళనను అడ్డుకోలేరంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: TSRTC: ప్రయాణీకులకు బంపరాఫర్..
Comments
Please login to add a commentAdd a comment