న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో మున్సిపల్ కార్పోరేషన్లలో నియామకాల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) రంగంలోకి దిగింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 20 చోట్ల సోదాలు నిర్వహించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. డమ్ డమ్, హలీసహర్, బడా నగర్ మున్సిపల్ కార్పొరేషన్లుసహా మొత్తం 14 కార్పోరేషన్ల కార్యాలయాల్లో సోదాలు జరిగాయి.
ఈ అవకతవకలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు అయాన్ సిల్, అతని ఆఫీస్, మరో ముగ్గురికి చెందిన ప్రాంతాల్లోనూ తనిఖీలు చేశారు. సాల్ట్ లేక్ ప్రాంతంలోని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగాయి. ముడుపులు తీసుకుని కొలువులు కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో సీబీఐ రంగప్రవేశం చేసింది. అయితే ఇదంతా కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రలో భాగమని పశ్చిమబెంగాల్ రాష్ట్ర మన్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్ హకీమ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment