విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మొదటిసారిగా ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు అమరావతి చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ – 2017ను నిర్వహించనున్నట్లు కమిషనర్ జె.నివాస్ వెల్లడించారు. తన చాంబర్లో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమం జరుగుతోందన్నారు. పిల్లల హక్కులకు సంబంధించిన సినిమాలు చూపించి వాటిపై చర్చ చేపట్టనున్నట్లు తెలిపారు. సినిమాను చూసి ఏం నేర్చుకోవాలనే విషయాన్ని తెలియజెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశ్యమన్నారు. 48 గంటల చాలెంజ్‌లో భాగంగా పిల్లలతో షార్ట్ ఫిల్మ్స్‌ను రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో వచ్చిన పిల్లల చిత్రాలను చూపించి వాటి ఆధారంగా షార్ట్ ఫిల్మ్స్ రూపకల్పన చేసే విధంగా ప్రణాళిక రూపొం దించామని వివరించారు.
పూణేకు చెందిన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆఫ్ ఇండియా బృందం సభ్యులు షార్ట్ ఫిల్మ్ తయారీపై పిల్లలకు శిక్షణ ఇస్తారన్నారు. బెస్ట్ ఫిల్మ్స్‌కు బహుమతుల్ని అందిస్తామన్నారు. వర్థమాన కథానాయకులు ఆదర్మ్, నిఖిల్ హాజరుకానున్నట్లు తెలిపారు. షార్ట్ ఫిల్మ్స్ తయారీపై ఆసక్తి గల నగరపాలక సంస్థ పాఠశాలల విద్యార్థులతో పాటు, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఆయా స్కూల్స్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించి 24 క్రాఫ్ట్స్‌పై అవగాహన కల్పించడంతో పాటు మేకింగ్‌కు సంబంధించి పరికరాలను ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండియా సమకూరుస్తోందని తెలిపారు. నగరంలోని పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment