అనంతపురం అర్బన్: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం జిల్లాకు వస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు అనంతపురంలోని మునిసిపల్ కార్పొరేషన్ అతిథిగృహానికి చేరుకంటారు. 11 గంటలకు కాపు రుణమేళాలో పాలొంటారు. మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. మూడు గంటలకు సంక్షేమ శాఖ అధికారులతో అతిథిగృహంలోనే సమీక్షిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి రోడ్డుమార్గంలో హైదరాబాద్‌కు వెళతారు.