Minister Colle Ravindra
-
నేడు మంత్రి కొల్లు రవీంద్ర రాక
అనంతపురం అర్బన్: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం జిల్లాకు వస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు అనంతపురంలోని మునిసిపల్ కార్పొరేషన్ అతిథిగృహానికి చేరుకంటారు. 11 గంటలకు కాపు రుణమేళాలో పాలొంటారు. మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. మూడు గంటలకు సంక్షేమ శాఖ అధికారులతో అతిథిగృహంలోనే సమీక్షిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి రోడ్డుమార్గంలో హైదరాబాద్‌కు వెళతారు. -
మంత్రి అనుచరుల దౌర్జన్యం
మచిలీపట్నం : ఓ ఇంటి స్థలం వివాదంలో మంత్రి అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనపై ఆర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. లంకిశెట్టి తాండవ కృష్ణకు జగన్నాథపురంలోని మహాలక్ష్మీ అమ్మవారి ఆలయం సమీపంలో ఇల్లు ఉంది. ఈ ఇంటిని తాండవకృష్ణ తండ్రి తన కుమార్తెలకు ఇస్తానని ప్రకటించడంతో గతంలో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో పెద్దమనుషుల సమక్షంలో రాజీ కుదిర్చారు. అప్పటి నుంచి తాండవకృష్ణ ఆ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. గత నెలలో ఈ గృహాన్ని మంత్రి కొల్లు రవీంద్ర తన భార్య నీలిమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రి అనుచరులు కొందరు తాండవ కృష్ణ ఇంటి వద్దకు వెళ్లి ఇల్లు ఖాళీ చేయాలని వాదనకు దిగారు. తనకు తెలియకుండానే ఇంటి రిజిస్ట్రేషన్ జరిగిందని, తనకు కొంత సమయం కావాలని తాండవకృష్ణ కోరారు. ఫిర్యాదు చేసిన ఆయనను పోలీ సులు బెదిరించే ధోరణితో మాట్లాడారు. ఈ విషయం బయటకు పొక్కడంతో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని , మరికొందరు కౌన్సిలర్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. వారి ఎదుటే తాండవకృష్ణను ఆర్‌పేట ఎస్.ఐ. బాషా బెదిరించే ధోరణితో మాట్లాడారు. దీంతో ఎస్.ఐ., నాని మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని ఎస్.ఐ. బాషా తెలిపారు. -
కోనలో సీన్ రిపీట్!
మంత్రి కొల్లు, ఎంపీ కొనకళ్లకు చుక్కెదురు.. బుద్దాలపాలెంలో కుర్చీలు విసిరేసిన గ్రామస్థులు సాక్షి, మచిలీపట్నం: కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం బుద్దాలపాలెంలో కోన గ్రామంలో జరిగిన సీన్ రిపీటైంది. బుద్దాలపాలెంలో భూసేకరణపై మంగళవారం రాత్రి ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావులకు చుక్కెదురైంది. స్థానిక ఎంపీయూపీ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి కొల్లు మాట్లాడుతూ అనుబంధ పరిశ్రమలకు భూసేకరణ చేస్తున్నామని, భూములు సేకరిస్తామే తప్ప గ్రామాలను ఖాళీ చేయించబోమని చెప్పారు. ఈ సందర్భంగా రైతులు స్పందిస్తూ.. ‘మాతో సంప్రదింపులు జరపకుండా మీ ఇష్టానుసారం భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రామంలో ఒక్క సెంటు భూమి కూడా పరిశ్రమల స్థాపన కోసం ఇచ్చేది లేదు. అప్పటి వరకు ఈ సమావేశంలో మాట్లాడవద్దు’ అంటూ అడ్డుతగిలారు. ‘భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసిన తర్వాతే మీరు గ్రామానికి రావాలి. అప్పటివరకు మీ మాటలు వినేది లేదు. తక్షణమే ఈ సభను రద్దు చేయాలి’ అని గ్రామస్థులు నినాదాలు చేశారు. అయినప్పటికీ మంత్రి మాట్లాడబోతుండగా కోపోద్రిక్తులైన గ్రామస్థులు వారి ఎదురుగా ఉన్న కుర్చీలను పైకి విసిరేశారు. సమావేశం జరిగే అవకాశం లేకపోవటంతో మంత్రి, ఎంపీ వెనుదిరిగారు. -
మంత్రి, ఎంపీని తరిమికొట్టిన కోన ప్రజలు
-
మంత్రి, ఎంపీని తరిమికొట్టిన కోన ప్రజలు
- పోర్టుకు భూసేకరణపై ఆగ్రహం మచిలీపట్నం: భూములపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలపై కృష్ణా జిల్లా బందరు మండలం కోన గ్రామ ప్రజలు తిరగబడ్డారు. బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమలకు భూసేకరణ అంశం గురించి మాట్లాడతాం.. అంటూ వెళ్లిన ప్రజాప్రతినిధులపై వారు విరుచుకుపడ్డారు. తీవ్రరూపం దాల్చిన నిరసన, కట్టలు తెచుకున్న ఆగ్రహంతో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావులను తరిమికొట్టారు. భూసేకరణ అంశంపై రైతులతో మాట్లాడేందుకు మంత్రి, ఎంపీ, పలువురు టీడీపీ నాయకులు శనివారం రాత్రి ఏడు గంటలకు అక్కడకు వెళ్లారు. కోన పంచాయతీ కార్యాలయం వద్ద మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడేందుకు ప్రయత్నించగా గ్రామ ప్రజలు ‘మా భూములు ఇచ్చేది లేదు’ అంటూ నినాదాలు చేశారు. దీంతో మంత్రి, ఎంపీల చుట్టూ ఉన్న పోలీసులు ప్రజలను తోసివేశారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన గ్రామ ప్రజలు పంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన షామియానాను పీకేశారు. సభకు ఏర్పాటు చేసిన విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పోలీసులు గ్రామ ప్రజలను సభ వద్ద నుంచి బయటకు తోసివేస్తూ లాఠీలు ఝలిపించారు. పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. మంత్రి, ఎంపీలను పోలీసులు పక్కకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. మరింత ఆగ్రహం చెందిన గ్రామస్తులు కొల్లు రవీంద్ర,కొనకళ్ల నారాయణరావులతో పాటు పోలీసులను వెంటపడి తరిమారు. అతి కష్టంమీద తీసుకెళ్లిన పోలీసులు గందరగోళ పరిస్థితుల మధ్య మంత్రి, ఎంపీలను అతి కష్టంమీద పోలీసులు కార్ల వద్దకు తీసుకు వచ్చారు. దీంతో గ్రామస్తులు కాన్వాయ్‌కు అడ్డుపడి వాహనాలను అడ్డుకున్నారు. మంత్రి, ఎంపీలు వాహనాలు ఎక్కిన తరువాత కూడా వాహనాలను వెంబడించి మెయిన్ రోడ్డు వరకూ తరిమారు. అతి కష్టంమీద మంత్రి, ఎంపీలను గ్రామం నుంచి బయటకు తీసుకొచ్చిన పోలీసులు సమీపంలోని పల్లెతుమ్మలపాలెం గ్రామంలోకి తీసుకు వెళ్లారు. గ్రామస్తులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో మంత్రి కొల్లు రవీంద్ర పీఏ హరినాథబాబు తలకు స్వల్ప గాయమైంది. రోడ్డుపై పడుకుని నిరసన... మంత్రులు ఊరిదాటి వెళ్లిపోయినా గ్రామస్తుల ఆగ్రహావేశాలు చల్లారలేదు. తమపై పోలీసుల చర్యను నిరసిస్తూ కోన గ్రామస్తులు కోన-పల్లెతుమ్మలపాలెం మెయిన్ రోడ్డుపై రాత్రి 8గంటల వరకూ అడ్డంగా పడుకున్నారుమచిలీపట్నం డీఎస్పీ శ్రావణ్‌కుమార్ నేరుగా ఆందోళన చేస్తున్న కోన ప్రజలకు సర్ది చెప్పారు. ప్రజలు ఆందోళన విరమించారు. మంత్రి, ఎంపీ పోలీసుల సహకారంతో పల్లెతుమ్మలపాలెం నుంచి మచిలీపట్నం వెళ్లారు. -
నాలుగు కోట్ల మంది పుష్కరస్నానాలు
మంత్రి కొల్లు రవీంద్ర అప్పనపల్లి (మామిడికుదురు) : గోదావరి పుష్కరాలు విజయవంతంగా జరుగుతున్నాయని, రాష్ట్రంలో ఇంత వరకు నాలుగు కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారని ఎక్సైజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆయన శుక్రవారం స్థానిక పుష్కరఘాట్‌ను పరిశీలించారు. ఇక్కడ భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లును పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. అనంతరం బాలబాలాజీ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ వీవీవీఎస్‌ఎన్ మూర్తి ఆధ్వర్యంలో రవీంద్రకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి చిత్రపటం అందజేశారు. మంత్రి రవీంద్ర విలేకర్లతో మాట్లాడుతూ పుష్కరాల్లో 5 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేస్తారని అంచనా వేస్తున్నామన్నారు. శనివారం పుష్కర దీపోత్సవంలో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. గోదావరి మాత అనుగ్రహం కావాలి గోదావరి మాత అనుగ్రహంతోనే నదుల అనుసంధానం సాధ్యమవుతుందని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం ఆగష్టు 15 నాటికి పూర్తి అవుతుందన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అత్మహత్య చేసుకున్న రైతుకు రూ.5 లక్షలు ప్యాకేజ్ అమలు చేస్తున్నామన్నారు. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, నగరం ఏఎంసీ చైర్మన్ కొమ్ముల నాగబాబు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మద్దాల కృష్ణమూర్తి, స్థానిక సర్పంచ్ బొంతు సూర్యభాస్కరరావు, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు సూదా బాబ్జీ, అల్లూరి గోపీరాజు, మొల్లేటి శ్రీనివాస్ ఉన్నారు.