ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, సంగారెడ్డి: మున్సిపల్ అధికారి వేధింపులు భరించలేని ఓ మహిళ తన భర్తతో కలిసి దేహశుద్ధి చేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జరిగింది. వివరాల ప్రకారం.. సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో పనిమీద వచ్చిన మహిళలను అక్కడి శానిటరీ ఇన్‌స్పెక్టర్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అధికారి ప్రవర్తనకు విసిగిపోయిన బాధితురాలు తన భర్తకు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త తన భార్యతో కలిసి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు చితకబాది పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment