హర్యానా కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ ముందంజ | BJP Leads In Haryana Civic Poll Results | Sakshi
Sakshi News home page

హర్యానా కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ ముందంజ

Published Wed, Dec 19 2018 1:08 PM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM

BJP Leads In Haryana Civic Poll  Results   - Sakshi

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ (ఫైల్‌ ఫోటో)

చండీగఢ్‌ : హర్యానాలో అయిదు మున్సిపల్‌ కార్పొరేషన్‌ల మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. మూడు కార్పొరేషన్లలో బీజేపీ మేయర్‌ అభ్యర్ధులు సమీప ప్రత్యర్ధులపై భారీ ఆధిక్యంలో దూసుకుపోతుండగా, మరో రెండు చోట్లు స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హిసార్‌లో బీజేపీ మేయర్‌ అభ్యర్థి గౌతమ్‌ సర్ధానా ఆధిక్యంలో ఉండగా..కర్నాల్‌, పానిపట్‌, రోహ్తక్‌, యమునానగర్‌లలోనూ బీజేపీ మేయర్‌ అభ్యర్ధులు వరుసగా రేణు బాల, అవనీత్‌, మన్‌మోహన్‌, మదన్‌సింగ్‌లు విపక్ష మేయర్‌ అభ్యర్ధుల కంటే ముందంజలో ఉన్నారు.

పలు రౌండ్ల లెక్కింపు మిగిలిఉండటంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మేయర్‌ ఎన్నికలను పాలక బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీ చేయకపోయినా కొందరు ఇండిపెండెంట్లకు మద్దతు ఇస్తోంది. విపక్ష ఐఎన్‌ఎల్డీ-బీఎస్పీ కూటమి కార్పొరేషన్‌ ఎన్నికల బరిలో నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement